లడ్డూ కల్లీ వివాదం వేళం.. బాధ్యతల నుంచి రిలీవ్ అయిన TTD EO

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్.. బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. తన బాధ్యతలను అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరికి అప్పగించారు. టీటీడీ కొత్త ఈఓ గా బదిలీ అయిన ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర.. బాధ్యతలు స్వీకరించేంత వరకు వెంకయ్య చౌదరి ఈ హోదాలో కొనసాగుతారు. నేడో, రేపో రవిచంద్ర టీటీడీ ఈఓగా బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.

చివరిసారిగా అనిల్ కుమార్ సింఘాల్ తన భార్యతో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో గల రంగనాయకులవారి మండపంలో అర్చకులు సింఘాల్ దంపతులకు వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి చిత్ర పటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం సింఘాల్ తన బాధ్యతలను వెంకయ్య చౌదరికి అప్పగించారు.

Anil Kumar Singhal releave from his Charges as TTD EO and handover to AEO Ch Venkaiah Chowdary

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం తలెత్తిన అనంతరం బదిలీ వేటును ఎదుర్కొన్న రెండో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్. తొలుత శ్యామలరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సింఘాల్ టీటీడీ ఈఓగా అపాయింట్ అయ్యారు. ఇప్పుడు ఆయనపై కూడా వేటు పడింది. సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం సింఘాల్ ను తప్పించింది. గతంలో ఈవోగా పని చేసిన సమయంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిందీ నివేదిక.

కాగా- తిరుమలలో ఆదివారం రాత్రి మాఘ శుద్ధ పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సాయంత్రం 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను క‌టాక్షించారు. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడినని స్వామివారు గరుడ వాహనసే ద్వారా తెలియజేస్తారని ప్రతీతి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+