వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు షాక్: ఏపీలో మరో 13 శాతం లిక్కర్ షాపుల క్లోజ్, ఇదివరకు 20 శాతం..

|
Google Oneindia TeluguNews

మందుబాబులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మరో 13 శాతం షాపులను తీసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 20 శాతం షాపులను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో మూసివేసిన లిక్కర్ షాపుల సంఖ్య 566కి చేరింది. కరోనా వైరస్ వల్ల భౌతిక దూరం పాటించకపోవడం.. గొడవల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పరిమిత సంఖ్యలోనే రాష్ట్రంలో లిక్కర్ షాపులు తెరుచుకునే అవకాశం ఉంది.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తొలుత 20 శాతం షాపులను మూసివేశారు. తర్వాత తాజాగా మరో 13 శాతం షాపులను క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4 వేల 380 వైన్ షాపులు ఉన్నాయి. ఇందులో 33 శాతం షాపులు క్లోజ్ చేస్తే..

another 13 percent liquor shops will close in ap

2 వేల 934 షాపులు మాత్రమే తెరచి ఉంటాయి. అదీ కూడా నిర్దేశిత సమయంలో.. లాక్ డౌన్ ఆంక్షలను పాటిస్తూ మాత్రమే లిక్కర్ విక్రయించాలని. ఏ కొంచెం తేడా వచ్చినా.. మిగతా షాపుల మాదిరిగానే క్లోజ్ చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పస్టంచేశారు.

English summary
another 13 percent liquor shops will close in andhra pradesh. previous 20 percent shops are closed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X