ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరో కూటమి అభ్యర్ధి ఘన విజయం..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధులు హవా కొనసాగిస్తున్నారు. ఇక ఇప్పటికే ఉమ్మడి కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం ఘన విజయం సాధించారు.
ఏడు రౌండ్‌లు పూర్తయ్యేసరికి.. మొత్తంగా 1,12,331 ఓట్లను పేరాబత్తుల రాజశేఖరం సాధించారు. ఇక పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులుకు ఏడో రౌండ్ ముగిసేసరికి 41,268 ఓట్లు పోలయ్యాయి. దీంతో రాజశేఖరం 71,063 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ప్రస్తుతం ఎనిమిదో రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుండగా.. కౌంటింగ్ పూర్తయితే మెజార్టీలో స్వల్ప మార్పులు ఉండే అవకాశం కనబడుతోంది.

ఇక విజయం సాధించినందుకు సంతోషంగా ఉందని పేరాబత్తుల రాజశేఖరం అన్నారు. రెండు జిల్లాల పట్టభద్రుల ఓటర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. పట్టభద్రుల హక్కుల సాధన కోసం పనిచేస్తానని.. నిరుద్యోగ యువత పట్ల గత ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించిందని పేరాబత్తుల మండిపడ్డారు. కూటమి అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications