వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంట్‌డౌన్ స్టార్ట్‌: ఏపీలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రం : 3న కీల‌క భేటీ..!

|
Google Oneindia TeluguNews

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల పైన ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. ఇదే స‌మ‌యంలో మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రానికి కౌంట్ డౌన్ మొద‌లైంది. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ఏపిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో పాటుగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌ను సైతం పూర్తి చేయాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. దీని కోసం ఈనెల 3వ తేదీన అన్ని విభాగాల‌తో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసింది. ఇందులో కార్యాచ‌ర‌ణ ఖ‌రారు చేయ‌నున్నారు.

మ‌రో ఎన్నిక‌ల స‌మ‌రం..
ఏపిలో మరో ఎన్నిక‌ల స‌మ‌రానాకి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఏపిలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, పంచాయతీల పైన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల సన్నద్ధతపై ఈనెల 3న రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఎన్నికలకు సంబంధించి అవ‌స‌ర‌మైన కార్యాచ‌ర‌ణ ఇందులో సిద్దం చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న వ‌న‌రులు..తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఇందులో చ‌ర్చిస్తారు. ప్ర‌ధానంగా రెండు లేదా మూడు నెల‌ల కాలంలోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఉన్న‌ట్లు తెలుస్తోంది. దీని కోసం అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు..సాంకేతిక అంశాలు..క్షేత్ర స్థాయి స‌మస్య‌ల పైనా చ‌ర్చించ‌నున్నారు.

Another Election war in AP : Key meeting on 3rd of this month

10న ఓట‌ర్ల జాబితా..

ఈనెల 10వ తేదీన పంచాయితీలు..పట్ట‌ణ స్థానిక సంస్థ‌ల్లోనూ ఓట‌ర్ల జాబితాల విడుద‌ల‌కు రంగం సిద్ద‌మైంది. ఏపిలోని మొత్తం 12,918 పంచాయతీల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను ఈనెల 10న ప్రకటించేలా అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ ఎన్నికల్లో ఉపయోగించిన జాబితాల ఆధారంగా గ్రామ పంచాయతీల వారీగా పురుషులు, మహిళలు, ఇతర ఓటర్ల జాబితాల సీడీలను అధికారులు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా రిజ‌ర్వేష‌న్లు 50 శాతానికి లోబ‌డి ఉండేలా ఆర్దినెన్స్ జారీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక... ఇదే విధానం అమలుకు నిర్ణయం తీసుకునేలా ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. పంచాయతీల్లో వివిధ వర్గాల జనాభా ఆధారంగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశాక స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువడనుంది.
అదే విధంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పైనా నిర్ణ‌యం తీసుకోనున్నారు.

English summary
Another election war in AP. State Elections commission preparing for conduct of Local body and municipal elections in AP shortly. On 3rd of May State Election Commission decided to conduct meeting on elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X