ఎవరికిష్టమున్నా లేకున్నా 4ఏళ్లు మేమే: కేసీఆర్, గుత్తాపై హైకమాండ్ సీరియస్

హైదరాబాద్: ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా నాలుగేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. కేసీఆర్ బుధవారం ఎన్టీఆర్ నగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నాలుగేళ్లు మా ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు. ఇళ్లున్న వారికి ఉచితంగా తాము పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇల్లు లేని వారికి కూడా ప్రభుత్వమే ఇళ్లు కట్టిస్తుందని చెప్పారు. గతంలో బీంరావ్ వాడాలో తొలగించిన ఇళ్లను అక్కడే కట్టిస్తామని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ నేతలతో మాట్లాడి వారికి వేరే స్థలం ఇస్తామని చెబుతామన్నరు. త్వరలో విక్టోరియా హోంను సందర్శిస్తానని కేసీఆర్ చెప్పారు. విక్టోరియా హోంలోని ఉపాధ్యాయులకు జీతాలు పెంచుతామని చెప్పారు. ఆయన బుధవారం పలుచోట్ల సందర్శించారు.

త్వరలో తాను పాతబస్తీలో పర్యటిస్తానని చెప్పారు. సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాతబస్తీలో మురికి కాలువల సమస్య పరిష్కారానికి ఇవాళే ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. గంగా - జమున సంస్కృతికి పేరుగాంచిన చారిత్రక నగరం హైదరాబాద్ అన్నారు.

హిందూ - ముస్లీంల ఐక్యతతో ప్రపంచానికే ఈ నగరం ఆదర్శం కావాలన్నారు. కాగా, కేసీఆర్ కొత్త పేట మార్కెట్, ఎర్రకుంట స్మశానం తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

 Another four years TRS government in Telangana, says KCR

కేసీఆర్ హుందాగా ఉండాలి: వీహెచ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హుందాగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంత రావు అన్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఓదార్చడం కాంగ్రెస్ పార్టీ ఆనవాయితీ అన్నారు. అందుకే రాహుల్ గాంధీ ఓదార్చారన్నారు.

దానిని రాజకీయం చేయడం సరికాదన్నారు. రాహుల్ యాత్ర తర్వాత రైతుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. ఓయు భూములను తీసుకుంటామని చెప్పడం సరికాదని వీహెచ్ అన్నారు. వర్సిటీ భూములు భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో అవసరమన్నారు.

వాటిని తీసుకునే బదులు నిరుపయోగంగా ఉన్న సెజ్ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వాలని వీహెచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆనాడు నిజాం ఓయూకు ఎక్కువ భూములు కేటాయించారన్నారు.

గుత్తాపై హైకమాండ్ సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దని లేఖ రాసిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉంది. దీనిపై సీనియర్ నేత జైరాం రమేష్ తెలంగాణ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారని తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరుల వద్ద గుత్తా ప్రస్తావన తీసుకు వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+