వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ... సెప్టెంబర్ 1 నుండి రేషన్ డోర్ డెలివరీ

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వాన్ని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకపక్క కరోనా, మరో పక్క విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన ఏపీ ప్రభుత్వానికి ఇబ్బంది గా మారాయి. అంతేకాదు వేధిస్తున్న ఆర్ధిక సమస్యలు సైతం ఏపీ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతుంది. అయినా సరే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం పాలనలోనూ , అటు కీలక నిర్ణయాలు తీసుకోవటంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ఇక ఇదే క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి .

నిన్న చెప్పారు నేడు చేశారు .. విశాఖ బాధితులకు 30 కోట్ల నష్టపరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వంనిన్న చెప్పారు నేడు చేశారు .. విశాఖ బాధితులకు 30 కోట్ల నష్టపరిహారం విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

సెప్టెంబర్ 1 నుంచి ఇంటికే రేషన్ బియ్యం డోర్ డెలివరీ

సెప్టెంబర్ 1 నుంచి ఇంటికే రేషన్ బియ్యం డోర్ డెలివరీ

సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి . కరోనా నివారణ చర్యల్లో భాగంగా పౌరసరఫరాల శాఖతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కోసం జనాలు లైన్లో నిల్చోవాల్సిన అవసరం లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు .

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం కార్డులు

ఇక ఇప్పటికే పైలట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్‌ 6 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తుంది ఏపీ సర్కార్ . అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ వాలంటీర్లు తయారు చేసి, లబ్దిదారులకు బియ్యం కార్డులు అందజేసి వారికే డైరెక్ట్ గా ఇంటికే బియ్యాన్ని పంపించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయబోతున్నారని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డు అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంటుంది . అందులో పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలను కూడా అందుబాటులో ఉంచారు.

Recommended Video

Vizag Gas Leak : Chandrababu Naidu Questions AP Govt Over Vizag Gas Tragedy
పారదర్శకతతో , అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా బియ్యం పంపిణీ

పారదర్శకతతో , అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా బియ్యం పంపిణీ

ఇక బియ్యం కార్డు పొందిన వారందరికీ ప్రతి నెలా గ్రామ వాలంటీర్లు ఇంటింటికి పెన్షన్ ఇచ్చిన విధంగానే బియ్యం డెలివరీ కూడా ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. గ్రామాల్లోని ప్రజలు ఇబ్బంది పడకుండా, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, క్షేత్ర స్థాయిలో పథకాలు దుర్వినియోగం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ ఈ నేపధ్యంలోనే ఇంటింటికీ రేషన్ కూడా డోర్ డెలివరీ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది . ప్రతినెలా 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేయ్యనున్నట్టు తెలుస్తుంది. దీని కోసం ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా పకడ్బందీ వ్యూహం రచిస్తుంది ఏపీ సర్కార్

English summary
Officials have been ordered to distribute quality rice to the beneficiaries from September 1 onwards. CM Jagan Mohan Reddy said the state-wide scheme would be implemented from September 1. The decision was taken by Chief Minister YS Jagan at a meeting with the Department of Civil supplies as part of Corona prevention measures. He ordered that the people for the ration should not stand in line.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X