పోలవరంలో మరో ముందడుగు-దిగువ కాఫర్ డయాఫ్రమ్ వాల్ పనులు మొదలు
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం బహుళార్ధసాధక జాతీయ ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టులో కీలకమైన దిగువ కాఫర్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇవాళ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ కూడా పూర్తయితే ప్రాజెక్టులో సింహభాగం పూర్తయినట్లే లెక్క.
పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనుల్ని నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ ఇవాళ ప్రారంభించింది. శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు మొదలుపెట్టారు. ఇందులో మేఘా సంస్ధ ప్రతినిధులతో పాటు జలవనరులశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. 96 మీటర్ల పొడవు,10మీటర్ల లోతు,1.2మీటర్ల వెడల్పుతో ఢయా ప్రం వాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారు.

దిగువ కాఫర్ ఢ్యాం పొడవు 1613మీటర్లు, ఎత్తు 30.5మీటర్లు ఉండబోతోంది. దిగువ కాఫర్ ఢ్యాం లో 63000 క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ పనులు పూర్తి. చేశారు. దిగువ కాఫర్ ఢ్యాం దగ్గర నదిలో గ్యాప్ లను పూడ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.

దీంతో ఈ కాఫర్ డ్యామ్ నిర్మాణం పై జలవనరుల శాఖ అధికారులతో పాటు మేఘా ఇంజనీరింగ్ సంస్ధ కూడా ప్రత్యేక దృష్టిసారిస్తోంది. ఎగువ,దిగువ కాఫర్ ఢ్యాంల నిర్మాణం అనంతరం ఎర్త్ కం రాక్ ఫిల్ ఢ్యాం నిర్మాణం పై దృష్టి పెడతారు.ఎగువ,దిగువ కాఫర్ డ్యాంల నిర్మాణం పూర్తి అవ్వగానే ఈసిఆర్ఎఫ్ పనులు మొదలుపెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసేలా పనులు చురుగ్గా సాగుతున్నట్లు నిర్మాణ సంస్ధ మేఘా ఇంజనీరింగ్ తెలిపింది.












Click it and Unblock the Notifications