ముత్తా చేరిక: వైఎస్ జగన్ చేతికి మరో దినపత్రిక (పిక్చర్స్)
కాకినాడ: పార్టీలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన కుమారుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు చేరడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చినట్లే ఉంది. వారు ముగ్గురు బుధవారం సాయంత్రం కాకినాడలో జరిగిన బహిరంగ సభలో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
ముత్తా గోపాలకృష్ణ చేతిలో ప్రస్తుతం ఆంధ్రప్రభ దినపత్రిక ఉంది. సర్క్యులేషన్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ అది తమ ఖాతాలో చేరడంతో జగన్‌కు ఏదో మేరకు ప్రయోజనకారిగా ఉంటుందని భావిస్తున్నారు. దాన్ని మెరుగు పరిచే ప్రయత్నాలు కూడా జరగవచ్చు.
ముత్తా గోపాలకృష్ణ గతంలో కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. నిజానికి, కాంగ్రెసు పార్టీలో ఉన్నప్పుడు జగన్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి నిరాదరణకు గురయ్యారు. దాంతో ఆయన టిడిపిలోకి వెళ్లాల్సి వచ్చింది.

కోఆర్డినేటర్‌గా ముత్తా శశిధర్
ముత్తా శశిధర్‌కు వైయస్ జగన్ కాకినాడ సిటీ కోఆర్డినేటర్ బాధ్యతలను అప్పగించారు. తాను చంద్రశేఖర రెడ్డితో కలిసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తానని శశిధర్ చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు
మాజీ శాసనసభ్యుడు కరసాల కన్నబాబుకు జగన్ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించారు. చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో కలిసి ఆయన పని చేస్తారు.

ముత్తా గోపాల కృష్ణ ఇలా...
మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికను కొనుగోలు చేసి నడిపిస్తున్నారు. అది జగన్‌కు కలిసి వచ్చే అంశమని అంటున్నారు.

చంద్రబాబుపై ధ్వజం
చంద్రబాబు ఇటు గ్రేటర్ హైదరాబాదులో ప్రచారానికి సన్నద్ధమవుతున్న స్థితిలో జగన్ కాకినాడలో సభ పెట్టి తీవ్రంగా ధ్వజమెత్తారు.

చంద్రబాబు మోసగాడు
చంద్రబాబు పచ్చి మోసగాడని, ఆ మోసగాడిపై కలిసికట్టుగా పోరాటం చేద్దామని వైయస్ జగన్ కాకినాడ బహిరంగ సభ నుంచి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications