వైసీపీ అధికారాన్ని అడ్డుకోవాలంటే మ‌రో "అధికారం" కావాలి??

రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెండోసారి అధికారంలోకి రావాల‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంద‌ని జ‌న‌సేన అధినేత కొణిదెల ప‌వ‌న్‌కల్యాణ్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ అధికారాన్ని అడ్డుకోవాలంటే మ‌రో అధికారం అండ ఉండాల‌నే యోచ‌న‌లో ఉన్నారు. అందుకే ఆయ‌న కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తాపార్టీని ఓట్లు చీలిపోనివ్వ‌కుండా పొత్తు ఉండేలా ఒప్పిస్తాన‌నే గ‌ట్టి న‌మ్మ‌కాన్ని వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

 ఎక్క‌డ చూసినా ముంద‌స్తు ప్ర‌స్తావ‌నే!

ఎక్క‌డ చూసినా ముంద‌స్తు ప్ర‌స్తావ‌నే!


ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్క‌డ చూసినా ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి ప్ర‌స్తావ‌నే చ‌ర్చించుకుంటున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో ఎక్కువ‌గా పొత్తుల‌పై టాపిక్ న‌డుస్తోంది. ఈ టాపిక్‌లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలుస్తున్నారు. వైసీపీని అడ్డుకోవాలంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ అండ తీసుకోవాల‌ని, ఆ అధికారాన్ని అడ్వాంటేజ్‌గా ఉప‌యోగించుకోవాల‌నేది ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆలోచ‌న అని ఆ పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.

అధికార పార్టీకి ఎదురొడ్డాలంటే గ‌ట్టి మ‌ద్ద‌తు అవ‌స‌రం

అధికార పార్టీకి ఎదురొడ్డాలంటే గ‌ట్టి మ‌ద్ద‌తు అవ‌స‌రం


ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికార పార్టీ ఎలాగైనా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంద‌ని, ఎదురొడ్డి నిల‌వాలంటే గ‌ట్టి మ‌ద్ద‌తు అవ‌స‌రం అని జ‌న‌సేనాని అంటున్నారు. ఓట్లు ఎట్టి ప‌రిస్థితుల్లోను చీల‌నివ్వ‌న‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఏపీ రాజ‌కీయాల్లో మార్పు ఆరంభ‌మైంది. అయితే జ‌న‌సేనతో మిత్ర‌త్వాన్ని కొన‌సాగిస్తున్న ఏపీ బీజేపీ నేత‌లు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌లు మాత్రం ఓట్ల చీలిక‌కు కార‌ణ‌మ‌వుతాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 జ‌న‌సేన సైనికుల తీవ్ర అస‌హ‌నం

జ‌న‌సేన సైనికుల తీవ్ర అస‌హ‌నం


భార‌తీయ జ‌న‌తాపార్టీతో మిత్ర‌త్వంపై జ‌న‌సేన సైనికులు మాత్రం తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మైనార్టీ ఓట్లు దూర‌మ‌వుతాయ‌ని, ఆ పార్టీవ‌ల్ల పెద్ద‌గా జ‌న‌సేన‌కు ఒన‌గూరేదేమీ లేదంటున్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా తాను బీజేపీతో మాట్లాడ‌తాన‌ని ప‌వ‌న్ అంటున్నారు. సోము వీర్రాజు, సునీల్ ధియోధ‌ర్ లాంటి నేత‌లు మాత్రం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే ప్ర‌స‌క్తే లేదంటున్నారు. ఇంకోవైపు జ‌న‌సేన అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది. ఇటువంటి ప‌రిస్థితిని ఛేదించి ఓట్లు చీల‌కుండా ప్ర‌తిప‌క్షాల‌న్నింటినీ ఒక తాటిపైకి తీసుకురావ‌డానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్రంగా కృషిచేయాల్సి ఉంటుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+