బొబ్బిలిలో మరో ప్రత్యూష: బిడ్డకు సవతి తల్లి చిత్రహింసలు, తండ్రి వంత
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో మరో ప్రత్యూష ఉదంతం వెలుగు చూసింది. బిడ్డను తన కళ్ల ముందటే రెండో భార్య చిత్రహింసలు పెడుతుంటే తండ్రి వంత పాడుతున్న అమానవీయ ఘటనకు స్థానికులు చలించిపోయారు.
విజయనగరం జిల్లా బొబ్బిలికి కాంతారావు అక్కడి పురపాలక సంఘం కార్యాలయంలో పని చేస్తారు. ఈ మధ్యకాలంలో ఆయన భార్య చనిపోయింది. అప్పటికే ఓ అమ్మాయికి తండ్రి అయిన కాంతారావు, బేబీ అనే మరో మహిళను పెళ్ళి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూతురు విజయలక్ష్మి నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టారు.

దాన్ని ఆసరగా తీసుకుని అతని రెండో భార్య ఆ బాలికను చిత్రహింసలకు గూరి చేయడం ప్రారంభించింది. భోజనం పెట్టకుండా వేధించడం మొదలు పెట్టింది. కొట్టడం, బాత్‌రూం పెట్టి కట్టిపడేయడం వంటి దుశ్చర్యలకు కూడా ఆమె పాల్పడింది.. తండ్రి కాంతారావు సవతి తల్లికి వంత పాడడంతో ఆ చిట్టి తల్లికి నరకం కళ్ళ ముందే కనిపించడం ప్రారంభమైంది.
దీనిపై తట్టుకోలేకపోయిన కాలనీ వాసులు వారిని నిలదీశారు. వారితో గొడవ పడ్డారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ లోపు కాంతారావు విజయలక్ష్మిని మానసిక వికలాంగుల ఆసుపత్రిలో చేర్పించేశారు. అయితే పోలీసులు సుమోటుగా కేసు నమోదు చేశారు. వివరాలు అడిగి తెలుసుకుని హెచ్చరికలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications