ఏపీలో వెలుగులోకి వచ్చిన మరో అత్యాచార ఘటన..స్కూల్‌కు వెళ్లే బాలికపై

ఏపీలో వరుస అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతనే ఉన్నాయి. తాజాగా ఏపీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి జిల్లా , యలమంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న కొత్త మాదిగ పల్లికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు దుండగులు దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బాలికను స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు, వాటర్ బాటిల్‌లో మత్తు మాత్రలు వేసి బలవంతంగా నీటిని తాగించి అత్యాచారం చేశారు. కూతురు ఇంటికి రాకపోవడంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు ముళ్లపొదలలో నిర్జీవంగా పడి ఉన్న కూతుర్ని చూసి అక్కడిక్కడే కూప్పకూలిపోయారు. స్థానికులు హుటాహుటిన మైనర్ బాలికను ఆస్పత్రికి తరలించారు.యలమంద ప్రభుత్వ ఆసుపత్రిలో బాలికకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు , బాలికను విచారిస్తున్నారు.

Another rape incident came to light in AP

ఏపీలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై వైసీపీ స్పందించింది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మహిళలపై జరిగిన

అఘాయిత్యాలు లెక్కలతో సహా వైసీపీ బయటపెట్టింది. శాంతిభద్రతలను గాలికి వదిలేశారని.. రాష్ట్రంలో వరుసగా చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే కనీసం వారి గోడు వినే ఓపిక కూడా ఈ ప్రభుత్వానికి లేదని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.అత్యాచార ఘటనలపై ఇప్పటికే వైసీపీ నేతలు మానవ హక్కుల సంఘం, జాతీయ మహిళా కమిషన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+