దువ్వాడ కుటుంబ కథా చిత్రం.. వాణిపై రెచ్చిపోయిన మాధురి!
దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నిన్నటికి నిన్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి తన భర్తకు మాధురితో ప్రాణహాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేస్తూ, తనప్రాణాలు, తన భర్తప్రాణాలు, తన పిల్లల ప్రాణాలను పోలీసులు కాపాడాలంటూ విజ్ఞప్తి చేసింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో అనధికారికంగా ఉంటున్న వ్యక్తులను బయటకు పంపాలని వ్యాఖ్యలు చేసింది.
మళ్ళీ సంచలన పోస్ట్ పెట్టిన మాధురి
ఈ వ్యవహారంలో జగన్ కూడా కల్పించుకొని శ్రీనివాస్ తో మాట్లాడాలని దువ్వాడ వాణి కోరింది. గత 11రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే బయటనుంచి ఆందోళన చేస్తున్న వాణి తాను తన బిడ్డలకోసం భర్తతో రాజీ అవుతానని ఆయనతో కలిసి ఉంటే చాలని వ్యాఖ్యలు చేస్తోంది. ఇదిలా ఉంటే దువ్వాడ వాణి చేసిన ప్రాణహాని ఆరోపణలపైన దివ్వల మాధురి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా మరొక సంచలన వీడియో పెట్టింది.

ప్రాణహాని ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మాధురి
దివ్వల మాధురి తనను డాక్టర్లు పది రోజులు రెస్ట్ తీసుకోమన్నారు అని పది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అనుకున్నానని, అయితే తనపై చేసిన ఆరోపణలతో మళ్ళీ మాట్లాడవలసి వస్తుందని పేర్కొంది. గత రెండేళ్ల నుండి వాణి భర్త శ్రీనివాస్ మాధురితోనే ఉన్నారని సంచలన ఆరోపణలు చేసిన వాణి, దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని ఉంటే రెండేళ్ల నుంచి తనతో ఎలా ఉండేవాడని ప్రశ్నించింది.
ఆ ఇల్లు తీసుకో.. కానీ ఇలానే
వాణి పట్టించుకోకపోతే రెండేళ్ల నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఆలనా పాలనా తానే చూసుకున్నానని చెబుతున్న మాధురి కేవలం ఆ ఇంటి కోసం ఇంతలా రచ్చ చేస్తుందని వాణిపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిలో తాను రెండుకోట్లు పెట్టుబడి పెట్టానని, దాని తాలూకు దువ్వాడ శ్రీనివాస్ తనకు చెక్కులు కూడా ఇచ్చారని, తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చిన తర్వాత వాణిని ఆ ఇల్లు తీసుకోమని చెబుతోంది.
వాణితోనే దువ్వాడకు ప్రాణహాని
నిజానికి వాణి తోనే దువ్వాడ శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని పదిరోజుల గురించి ఆమె చేస్తున్న వీరంగం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుందని మాధురి రియాక్ట్ అయింది. తనకు రావలసిన రెండు కోట్ల కోసం తాను కూడా వెళ్లి ఇంటి ముందు కూర్చుని ఆందోళన చేయగలనని పేర్కొన్న మాధురి, దువ్వాడ శ్రీనివాస్ పైన గౌరవంతో తాను ఆ పని చేయడం లేదని చెప్పింది.
రెండు కొట్లిచ్చి ఇంట్లో ఉండమని సలహా
దువ్వాడ శ్రీనివాస్ ఎవరి డబ్బులు ఉంచుకునే వాడు కాదు కాబట్టి తాను ఇచ్చిన డబ్బులకు తనకు మళ్ళీ చెక్కులు ఇచ్చారని మాధురి తెలిపింది. ఆ ఇంటి కోసమే వాణి పోరాటం చేస్తే నా రెండు కోట్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉండొచ్చని మాధురి పేర్కొంది. అప్పటివరకు ఆ ఇంటిపైన తనకే హక్కు ఉందని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి ముగింపు పలకకుండా కావాలని వాణి కొనసాగిస్తుందని మాధురి ఆరోపిస్తుంది.












Click it and Unblock the Notifications