కావలిలో మరో స్వాతి...ప్రియుడి కోసం భర్తను హత్య చేసేందుకు సుపారి

కావలి: ఏ క్షణంలో స్వాతి ఉదంతం బైట పడిందో కాని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా అదే రకమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ప్రియుడి కోసం భర్తను చంపి అతడి స్థానంలో లవర్ ను ఉంచి నాటకమాడి దొరికిపోయిన స్వాతి ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

తాజాగా అదే క్రమంలో కర్నూలు జిల్లా బ్రాహ్మణపల్లె లో ఒక ఇల్లాలు ప్రియుడి తో కలసి ఉండటం కోసం భర్తను చంపించి పోలీసులకు పట్టుబడిపోగా ఇప్పుడు ఇదే తరహా ఘటన నెల్లూరు జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది. కాకపోతే ఈ ఘటనలో భర్త అదృష్టం బాగుండటంతో తనను చంపేందుకు భార్య కాంట్రాక్ట్ ఇచ్చిందన్న విషయం తెలిసి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తిని అరెస్ట్ చెయ్యగా, తమ విషయం బైటపడిందని తెలిసి సదరు భార్య ఆమె ప్రియుడు పరారయ్యారు.

 Another Swathi in kavali... husband murdered for lover

ఇది జరిగింది...
ఇలా జరిగింది...
నెల్లూరు జిల్లా కావలిలో

సాయి ప్రియ అనే గృహిణి జైల్ గార్డ్ గా పనిచేసే రవి అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తన భర్త లింగం మాల్యాద్రి ని అడ్డుతొలగించుకుంటే ప్రియుడితో కలసి హ్యాపీగా ఉండొచ్చని భావించింది. దీంతో భర్తను హత్య చేయడానికి 5 లక్షలు

కిరాయి గూండాలకు సుపారి ఇచ్చింది. భార్య తనను హత్య చేసేందుకు పురామయించిందన్న

విషయం భర్తకు తెలియడంతో అతడు క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా వెళ్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపి

కిరాయి గుండా రాజేష్ ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాల్యాద్రి భార్య

సాయి ప్రియ, ప్రియుడు జైల్ గార్డ్ రవి పరారయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+