కాంగ్రెస్ లోకి మరో వైసీపీ ఎమ్మెల్యే? జగన్ టికెట్ నిరాకరణతో..!
ఏపీ కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికకు ముందే శుభవార్తలు అందుతున్నాయి. తెలంగాణలో వైఎస్సార్టీపీని స్దాపించి ఊరూరా తిరిగినా చెప్పుకోదగిన నేతలెవరూ ఆమె వెంట రాలేదు. కానీ ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే ఆమె రాకను ఊహించి ఆ పార్టీలోకి వచ్చేందుుక నేతలు సిద్ధమవుతున్నారు.
అదీ అధికార పార్టీ వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలే. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు జగన్ టికెట్ నిరాకరిస్తున్న సమాచారంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పగా.. తాజాగ మరో ఎమ్మెల్యే అదే బాట పట్టేలా ఉన్నారు.

వైసీపీ తాజాగా ప్రకటించిన ఇన్ ఛార్జ్ ల మార్పుల్లో విజయవాడ సెంట్రల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణుకు టికెట్ గల్లంతైంది. ఆయన స్ధానంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు అవకాశం కల్పించారు. దీంతో మల్లాది విష్ణు అనుచరులు రాత్రి ఈ ప్రకటన రాగానే విజయవాడలో ఆందోళనకు దిగారు. మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీపై నిప్పులు చెరిగారు.
ఈ నేపథ్యంలో అనుచరులతో భేటీ అయిన మల్లాది విష్ణు.. తన దాని తాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. కాసేపట్లో జింఖానా గ్రౌండ్స్ లో సమావేశమై మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమవుతున్నారు. గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి కూడా ఆశించిన విష్ణు.. అది కాస్తా రాకపోవడంతో బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి ఇస్తే సరిపెట్టుకున్నారు. అలాగే రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్ష పదవి ఇస్తే తీసుకున్నారు. కానీ మంత్రి మాత్రం కాలేకపోయారు. దీంతో అసంతృప్తిగా ఉన్న మల్లాది విష్ణును జగన్ ఇప్పుడు ఎమ్మెల్యే పదవి నుంచి కూడా తప్పించారు. దీంతో ఆయన రగిలిపోతున్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాది విష్ణు అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా కేవలం 15 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన తిరిగి తన మాజీ పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీంతో షర్మిల కాంగ్రెస్ లో చేరాక మల్లాది విష్ణు ఆమెను కలిసే అవకాశం ఉంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications