ఎల్లుండి టీడీపీలోకి మరో వైసీపీ ఎంపీ ! అభిమానులకు లేఖ..
ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ చేపట్టిన ఇన్ ఛార్జ్ ల మార్పులు ఆ పార్టీలో ప్రజాప్రతినిధుల్లో పలువురికి సీట్లు లేకుండా చేశాయి. సిట్టింగ్ స్ధానాల్ని వదులుకుని పోటీకి దూరంగా ఉండటం ఇష్టం లేక ఇందులో చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. అదే క్రమంలో పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన బాట పట్టారు. ఇప్పుడు మరో వైసీపీ ఎంపీ కూడా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి గెలిచిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి మాత్రం వైసీపీ మొండిచేయి చూపింది. వివిధ కారణాలతో మరోసారి ఆయన్ను ఒంగోలు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. మాగుంటకు మద్దతుగా జగన్ కు అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో మాగుంట తన దారి తాను చూసుకోక తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడితో కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

అందరికీ నమస్కారం,
— Magunta Sreenivasulu Reddy (@magunta_msr) March 13, 2024
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, వారి తనయుడు యువనాయకులు శ్రీ మాగుంట రాఘవ రెడ్డి గారు ప్రకాశం జిల్లా ప్రజల ఆశీస్సులతో మాగుంట అభిమానులతో కలిసి 16-03-2024 న (శనివారం) సాయంత్రం గం. 04.00 లకు మాజీ ముఖ్యమంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ… pic.twitter.com/ROviIt2xQS
ఎల్లుండి చంద్రబాబు సమక్షంలో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డితో కలిసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అనంతరం రాఘవరెడ్డికి టీడీపీ ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులకు ఎంపీ మాగుంట ఓ లేఖ రాశారు. ఇందులో ఆయన.. ఈ నెల 16న సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీలో చేరతానని ప్రకటించారు. తనతో పాటు కుమారుడు రాఘవరెడ్డి కూడా చేరబోతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications