వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బందరు టెక్కీ అనూహ్య రేప్, హత్య: మరణశిక్షపై దోషి అపీల్

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం సాఫ్ట్‌లేర్ ఇంజనీర్ అనూహ్య రేప్, హత్య కేసులో దోషిగా తేలి మరణశిక్ష పడిన టాక్సీ డ్రైవ్ర చంద్రబాన్ సనప్ తనకు విధించిన శిక్షపై అపీల్ చేసుకున్నాడు. అపీల్‌ను బొంబై హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. తనకు విధించిన మరణశిక్షను అతను హైకోర్టులో సవాల్ చేశాడు.

ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో దిగిన టిసిఎస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన ఈస్టర్ అనూహ్యను అంధేరిలోని హాస్టల్‌లో దింపుతానని చెప్పి చంద్రబాన్ సనప్ తన వెంట తీసుకుని వెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేసినట్లు నిర్ధారణ కావడంతో ప్రత్యేక కోర్టు అతనికి నిరుడు మరణశిక్ష విధించింది.

Anuhya murder case: Sanap's appeal against Death penalty

అనూహ్య కేసులో సనప్‌ను దోషిగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు నిరుడు అక్టోబర్ 30వ తేదీన తీర్పు చెప్పింది. ట్రయల్ కోర్టు దీన్ని అరుదైన కేసుల్లో అరుదైన కేసుగా పరిగణించింది. మచిలీపట్నం నుంచి బయలుదేరిన అనూహ్య నిరుడు జనవరి 5వ తేదీన ముంబై చేరుకని సనప్ బారిన పడింది.

తీవ్రమైన గాలింపు తర్వాత అనూహ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు జనవరి 16వ తేదీన పొదల్లో కనిపించింది. మార్చిలో సనప్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సనప్‌కు విధించిన మరణశిక్ష ధ్రువీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది. సనప్ పిటిషన్‌తో పాటు ఈ పిటిషన్ కూడా విచారణకు రానుంది.

English summary
The Bombay High Court today admitted an appeal filed by Chandrabhan Sanap, convicted in the rape and murder case of a Hyderabad techie, challenging the death penalty awarded to him by a special court last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X