AP 10th Results: ఏపీలో పదో తరగతి రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఎలా చెక్ చేసుకోవాలంటే ?

ఆంధ్రప్రదేశ్‌ లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేయగా.. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 81.14 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు విద్యాశాఖ ప్రకటించింది. వారిలో అబ్బాయిలు 78.31 శాతం, అమ్మాయిలు 84.09 శాతం ఉత్తీర్ణుల‌య్యారు. ఈ సంవత్సరం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 4,98,585 మంది ఉత్తీర్ణులయినట్టు వెల్లడించారు.

పార్వతీపురం మన్యం జిల్లా 93.90 శాతం ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉండటం సంతోషంగా ఉందని నారా లోకేశ్‌ పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేశ్‌ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు నిరుత్సాహపడవద్దని.. రెండవసారి పరీక్ష రాసే అవకాశం ఉందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19వ తేదీ నుంచి 28 వరకు జరుగుతాయని స్పష్టం చేశారు. అలానే ఏపీలోని 1,680 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత న‌మోదవ్వగా.. 19 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత న‌మోదైంది.

ap-10th-class-results-are-released-by-minister-lokesh

విద్యార్ధులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్స్ https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/ లలో మాత్రమే కాకుండా పలు సైట్స్ లలో కూడా చెక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా ఈ ఏడాది 'మన మిత్ర' (వాట్సాప్) ద్వారా కూడా చెక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. వాట్సాప్ లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపి, విద్యా సేవలను ఎంచుకుని, ఆపై SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఎంచుకుని, వారి రోల్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాల PDF కాపీని పొందవచ్చు.

అలానే సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాల లాగిన్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా LEAP మొబైల్ యాప్ ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించారు. ఈ ఏడాది మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. వీరి జవాబు ప్రశ్నాల మూల్యాంకనం ఏప్రిల్ 15 నాటికి పూర్తి చేశారు. అనంతరం ఫలితాల కంప్యూటరీకరణ ప్రక్రియ పూర్తి చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+