ఏపీ టు తెలంగాణ: ఈఎస్ఐ స్కాంలో కోదాడకు ఏసీబీ, అజ్ఞాతంలోకి ప్రమోద్ రెడ్డి..

ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ తెలంగాణ రాష్ట్రానికి చేరింది. కోదాడలో ఏపీ ఏసీబీ అధికారులు వాలిపోయారు. టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌ ఇంటి వద్దకు రాగా.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ అతనికి ఈఎస్ఐ స్కాంతో సంబంధంపై ఆరా తీస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ ఈఎస్ఐ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఏ-1గా, మాజీమంత్రి అచ్చెన్నాయుడును ఏ-2గా చేర్చి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

కుంభకోణానికి సంబంధించి టెలీ హెల్త్ సర్వీస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డిని ఏ-3గా చేర్చారు. స్కాంపై విచారించేందుకు కోదాడకు ఏసీబీ అధికారులు చేరుకున్నారు. ఏపీ నుంచి అధికారులు తెలంగాణకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ స్కాంలో ఇంకా ఎవరికీ సంబంధం ఉందోననే అంశంపై విచారణలో స్పష్టత రావాల్సి రానున్నది.

ap acb officers inquired a-3 accused in esi scam in kodad..

నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్‌కు కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ వాదిస్తోంది. ఈ క్రమంలోనే ప్రమోద్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఆదివారం కోదాడ వచ్చారు. కానీ అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొబైల్ ఆన్ ఉంటే లొకేషన్ ఆధారంగా కనిపెడతారని భావించి.. స్వీచాఫ్ చేసుకున్నాడు.

ప్రమోద్ రెడ్డి లేకపోవడంతో అతని తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులను ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రమోద్ రెడ్డి.. కంపెనీకి సంబంధించి అడిగినట్టు సమాచారం. ప్రమోద్ రెడ్డి స్వస్థలం అనంతగిరి మండలానికి కూడా ఏసీబీ అధికారులు వెళ్లారు. అతని ఆఛూకీ కోసం కోదాడ, పరిసర ప్రాంతాల్లో నిఘా పెట్టినట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+