వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు టిడిపి కౌంటర్: నోటి దురద, నిరాశతోనే విమర్శలు: మంత్రులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఏడు ప్రశ్నలు సంధించిన వైసీపీ చీఫ్ వైఎస్ జగన్, ఏపీకి అన్యాయం చేసిన ప్రధాన మంత్రి మోడీని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

శుక్రవారం నాడు రాత్రి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడాన్ని మంత్రి సోమిరెడ్డి తీవ్రంగా ఖండించారు.

Ap Agriculture minister Somireddy chandramohan reddy slams on Ys jagan

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్ జగన్ నీచంగా మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. 12 కేసుల్లో జగన్ నిందితుడిగా ఉన్నాడని ఆయన చెప్పారు. తన ఆస్తులను కూడ ప్రకటించలేదన్నారు.

ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో విపక్షనేతగా వైఎస్ జగన్ పనికిరాడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. విపక్ష నేతగా పనికిరాని జగన్ ఎక్కడ దూకుతారని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ కూడ ప్రధానమంత్రి మోడీని కలిశారని సోమిరెడ్డి చెప్పారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించడాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.జగన్‌ నోటి దురద ఇప్పటిది కాదని.. నోటి దురదే జగన్‌కు శాపమని వ్యాఖ్యానించారు. జగన్‌ నిస్పృహతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. విశ్వసనీయత ఎవరికి ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసంటూ మంత్రి చెప్పుకొచ్చారు.తాము చేస్తున్న పోరాటమేమిటో ప్రజలకు తెలుసునని మంత్రి చెప్పారు. జగన్‌ అంటే ఏంటో ఇప్పటికే ప్రజలకు అర్ధమైంది" అని మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

జెసి దివాకర్ రెడ్డి సవాల్

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఏడుగురు ఎంపీలతో రాజీనామాలు చేయిస్తే తాను కూడ రాజీనామా చేస్తానని టిడిపి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి చెప్పారు.అయితే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తున్నారు.

English summary
Ap agriculture minister Somireddy Chandramohan Reddy made allegations on Friday. He spoke to media on Amaravathi at Amarravathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X