సిబిఐ విచారణకు సై: సోమిరెడ్డి, కార్యకర్తలకే పవన్‌ టచ్‌లో ఉండరు, 40 మంది ఎమ్మెల్యేలా: బొండా

అమరావతి:మిత్రపక్షాలపై బిజెపి అనుసరిస్తున్న వైఖరి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వంపై ఎన్ని సిబిఐ విచారణలు చేయించినా తమకు నష్టం లేదని ఆయన చెప్పారు. అవినీతిపరుడిని తమ పక్కన పెట్టుకొని మిత్రపక్షాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నించిన బిజెపి తగిన ఫలితాన్ని అనుభవించనుందన్నారు

Recommended Video

    పవన్ కళ్యాణ్ ఆదేశించాడు , కేంద్రం పాటిస్తోంది !

    ఏపీ ప్రభుత్వంపై, టిడిపి నేతలపై బిజెపి నేతలు కక్షపూరితంగా వ్యవహరించేందుకు ప్రయత్నాలు చేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించారని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

    ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. బిజెపి ఎన్ని రకాలుగా తమ పార్టీని దెబ్బకొట్టే ప్రయత్నాలు చేయాలని చూసినా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామని టిడిపి ప్రకటించింది.

    బిజెపికి ప్రజలు బుద్దిచెబుతారు

    బిజెపికి ప్రజలు బుద్దిచెబుతారు

    ఏపీ రాష్ట్రానికి న్యాయం చేయకుండా రాజకీయంగా తమను నష్టపర్చేందుకు బిజెపి చేస్తున్న పన్నాగాలను ప్రజలు గమనిస్తున్నారని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నికల సమయంలో అవినీతిపరుడిగా ప్రచారం చేసిన పార్టీ నేతను తమ పక్కన పెట్టుకొని మిత్రపక్షాన్ని ఇరుకునపెట్టేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందన్నారు. పరోక్షంగా వైసీపీ నేత వైఎస్ జగన్‌‌పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

    ఏ విచారణ చేసినా ఇబ్బందులు లేవు

    ఏ విచారణ చేసినా ఇబ్బందులు లేవు

    తమ ప్రభుత్వంపై ఏ విచారణ చేసినా తమకు ఇబ్బందులు లేవని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోందని సోమిరెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హమీలను అమలు చేయాలని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

    పోలవరం నిర్మాణం ఆపాలని చూస్తున్నారు

    పోలవరం నిర్మాణం ఆపాలని చూస్తున్నారు

    ఏపీ రాష్ట్రానికి వరప్రసాదాయినిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు పోలవరం ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకొందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొండా ఉమా మహేశ్వర్ రావు గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి చోటు చేసుకొందని కొందరితో తప్పుడు ప్రచారం చేస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని కేంద్రం చూస్తోందని బొండా ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు.

     మా 40 మంది ఎమ్మెల్యేలు పవన్‌తో ఎలా టచ్‌లో ఉంటారు

    మా 40 మంది ఎమ్మెల్యేలు పవన్‌తో ఎలా టచ్‌లో ఉంటారు

    జనసేన పార్టీ నాయకులకే ఆ పార్టీ నేత పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండరని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు చెప్పారు. తమ పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్‌తో ఎలా టచ్‌లో ఉంటారని బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు.అసలు జనసేన కార్యకర్తలే టచ్‌లో ఉండని పవన్‌కు... 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారనడం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. పవన్‌ ఎవరి డైరెక్షన్‌లో నడుస్తున్నారో అందరికీ తెలుసునని ఉమా అన్నారు.తెలుగుజాతితో పెట్టుకున్నవారెవరూ బాగుపడలేదని బోండా ఉమా అన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+