రాజస్థాన్ స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో...స్పెషల్ అట్రాక్షన్ గా ఎపి అమరావతి స్టాల్
అమరావతి:రాజస్థాన్ లో నిర్వహిస్తున్న స్మార్ట్ సిటీ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఎపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన అమరావతి స్టాల్ అక్కడి సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోందని సిఆర్డీఎ అధికారులు తెలిపారు.
కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జైపూర్ డెవల్‌పమెంట్ అథారిటీ, క్వాంటెలా మీడియా సంస్థల ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా ఈ స్మార్ట్ సిటీ ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్ పో ప్రారంభోత్సవంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పాల్గొన్నారు.

ఈ ప్రదర్శనలో ఎపి ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏఎస్‌ఎస్‌సీసీఎల్) నేతృత్వంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించిన విశేషాలతో కూడిన ఒక స్టాల్ ను ఏర్పాటుచేశారు. మిగిలిన స్టాల్స్ తో పోలీస్తే ఈ అమరావతి స్టాల్ ప్రత్యేకంగా ఉండటంతో ఇది సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోందని ఎపి అధికారులు చెబుతున్నారు.
ఈ అమరావతి స్టాల్ లో అమరావతి స్మార్ట్ సిటీ నిర్మాణ ప్రణాళిక, గవర్నమెంట్ కాంప్లెక్స్, ఐకానిక్ భవనాలైన అసెంబ్లీ, హైకోర్టులతోపాటు సెక్రటేరియట్ టవర్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మొదలుకొని నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాల నమూనాలతోపాటు రహదారుల చిత్రాల నమూనాలను ప్రదర్శనకు ఉంచారు.
వీటి గురించి, వీటి ప్రత్యేకతల గురించి ఏఎస్‌ఎస్‌సీసీఎల్ అధికారులు సందర్శకులకు వివరించారు. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ డిప్యూటీ డైరెక్టర్ వి.భవానీప్రసాద్, ప్రాజెక్ట్ మేనేజర్లు జి.ఫణికుమార్, ఆర్.దివ్యకీర్తి, మేనేజర్ కోటేశ్వరరావు, ఆర్కిటెక్ట్ కార్తీక్, కన్సల్టెంట్ మోహిత్ తదితరులు అక్కడే మకాం వేసి ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications