అసెంబ్లీ ప్రారంభం వేళ కీలక పరిణామాలు..!!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్దమైంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ఆరంభం అవుతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరు వాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. మాజీ సీఎం జగన్ తన పార్టీ శాసన సభ్యులతో ఈ రోజు సమావేశానికి హాజరవుతున్నారు. సమావేశాల్లో వ్యూహాల పైన పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేసారు. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశం లో అజెండా ఖరారు చేయనున్నారు. ఈ సమావేశాలు కూటమికి కీలకంగా మారుతున్నాయి.

గవర్నర్ ప్రసంగం
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యే ఈ సమావేశాలు మూడు వారాల పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాక సభ వాయిదా పడనుంది. అనంతరం జరిగే శాసనసభ సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల అజెండా.. నిర్వహణ పైన తుది నిర్ణయం తీసుకోను న్నారు. ఈ నెల 28వ తేదీన 2025-26వార్షిక బడ్జెట్​ను ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్ట నుంది. ఇప్పటికే స్పీకర్ సమావేశాల నిర్వహణ పైన అధికారులకు దిశా నిర్దేశం చేసారు. భద్రతా పరంగా కీలక చర్యలు తీసుకున్నారు. ప్రవేశాల పై పరిమితులు విధించారు.

AP Assembly Budget Session starting today with Governor addressing BAC to decide agenda

జగన్ హాజరు
ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి పైన జనసేన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు. సభలో ఎమ్మెల్యేలు హుందాగా వ్యవహరించాలని సూచించారు. వైసీపీ సభ్యులు హాజరవుతున్న వేళ వారి ట్రాప్ లో పడవద్దని సూచించారు. నియోజకవర్గ అంశాల పైన సభ్యులు ప్రస్తావన చేయాలని నిర్దేశించారు. అటు మాజీ సీఎం జగన్ ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యే లతో సమావేశం కానున్నారు. వారితో కలిసి అసెంబ్లీకి హాజరు కానున్నారు. గవర్నర్ ప్రసంగం వేళ నిరసనకు వైసీపీ సిద్దం అవుతోంది. జగన్ ఈ ఒక్క రోజు సమావేశానికి మాత్రమే హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. వరుసగా మూడు రోజులు పులివెందుల పర్యటన ఖరారైంది.

28న బడ్జెట్
ఈ నెల 28న ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశ పెట్టనుంది. కూటమి ప్రభు త్వం ఏర్పడిన తరువాత ప్రవేశ పెడుతున్న తొలి స్థాయి పూర్తి బడ్జెట్ కావటంతో పథకాలకు కేటా యింపుల పైన ఆసక్తి నెలకొంది. సూపర్ సిక్స్ పథకాలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని అంచనా వేస్తున్నారు. ఇక.. ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులతో పాటుగా తొమ్మది నెలల పాలనలో తీసుకున్న పలు నిర్ణయాల గురించి సభా వేదికగా ప్రజలకు వివరించేందుకు సిద్దం అవుతోంది. ఈ నెల 26, 27 తేదీలు సమావేశాలకు విరామం ఇవ్వనున్నారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో... ఈ రోజు మంత్రులు, ఎన్నికలు జరిగే జిల్లాల ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కూటమి నేతలు సమావేశం ఏర్పాటు చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+