అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

KCR అంచనా ప్రకారం.. APలో 6 నెలల ముందు..!!

|
Google Oneindia TeluguNews

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జన్మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా తన ప్రణాళికలు అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉన్నప్పటికీ నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశమవుతున్న జగన్ వారితో 16 నెలలే సమయం ఉందని చెబుతుండటం విశేషం.

రెండూ ఒకేసారి అయితే ఇబ్బంది?

రెండూ ఒకేసారి అయితే ఇబ్బంది?

షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లోఎన్నికలు జరగాలి. ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటే ఇబ్బందికర పరిణామాలెదురవుతాయని జగన్ భావిస్తున్నారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి షెడ్యూల్ ప్రకారం లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొంటే సులువుగా ఉంటుందని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీని, శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండటంతోపాటు ఒకరి అభిప్రాయాలు మరికొరికి చెప్పి నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. కేసీఆర్ బీజేపీపై యుద్ధాన్ని ప్రకటించారు. జగన్ మాత్రం సానుకూలతను ప్రదర్శిస్తున్నారు. ఈ ఒక్క విషయంలో తప్పితే ఇద్దరూ పరస్పర ప్రయోజనాలు ఆశిస్తుంటారు.

శ్రేణులను సిద్ధం చేస్తున్న కేసీఆర్

శ్రేణులను సిద్ధం చేస్తున్న కేసీఆర్

పార్టీ నాయకులతో విస్త్రతస్థాయి సమావేశం నిర్వహించినప్పుడు కేసీఆర్ 10 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి.. ఎదుర్కోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి అన్నారు. మరోవైపు వైఎస్ జగన్ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిపించడానికే మొగ్గుచూపుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏపీ అసెంబ్లీకి తెలంగాణ అసెంబ్లీతో పాటే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోను అధికారాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతాపార్టీ ఉంది. ఏపీలో చివరకు బీజేపీ టీడీపీ-జనసేనతో కలిస్తే ఇబ్బంది అని జగన్ భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ పూర్తిగా తెలంగాణపై దృష్టి పెడుతుంది.

బాబు దృష్టి తెలంగాణపై పడుతుంది

బాబు దృష్టి తెలంగాణపై పడుతుంది


చంద్రబాబునాయుడు కూడా తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల విషయం చూడాలి కాబట్టి పూర్తిస్థాయిలో ఏపీపై దృష్టిపెట్టే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా తీరు ఉన్నట్లు పార్టీ కార్యాలయవర్గాలు చెబుతున్నాయి. ముందస్తు లేదని కేసీఆర్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఏడాదిలోపు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఏపీకి ఏడాదిన్నరలోపు జరగాల్సి ఉంటుంది. ఏతావాతా ఇరు రాష్ట్రాల్లోను ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనేది దాదాపుగా స్పష్టమవుతోంది.

English summary
Political analysts are predicting that YS Jagan is also inclined to hold elections for AP assembly along with Telangana assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X