ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు... తేదీలు ఖరారు...? ఎప్పటినుంచి ప్రారంభమవుతాయంటే...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఐదు లేదా ఆరు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబరులో మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం కంటే రెండు నెలల గ్యాప్‌లో మళ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

శాసనమండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నికలను అసెంబ్లీ సమావేశాల సమయంలోనే నిర్వహించాలని గతంలో నిర్ణయించినప్పటికీ... ఇప్పుడా నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాకే ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 11కి 11 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీనే దక్కించుకుంటుందని ఆ పార్టీ భావిస్తోంది. అదే జరిగితే మండలిలో వైసీపీ బలం మరింత పెరుగుతుంది. అందుకే ఛైర్మన్,డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల తర్వాతే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ap assembly monsoon session likely to begin from sep 21st or 22nd

వైసీపీ అధికారంలోకి వచ్చాక శాసనమండలిలో తగిన బలం లేకపోవడంతో రాజధానుల వికేంద్రీకరణ బిల్లు,సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. శాసనమండలి ఛైర్మన్ ఆ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించడంతో సీఎం వైఎస్ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా మండలి రద్దుకు తీర్మానం కూడా చేశారు. కానీ తర్వాత మండలిలో వైసీపీ సభ్యులు పెరగడం,కొత్తగా మరికొందరికి పదవులు వచ్చే అవకాశం ఉండటంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గారు.

ఆరుగురు ఐఏఎస్‌ల బదిలీ :
రాష్ట్రంలో తాజాగా ఆరుగురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కె.విజయ, సీసీఎల్‌ఏ అప్పిల్స్‌ కమిషనర్‌గా డా. పి.లక్ష్మీనరసింహం, ఏఎంఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా పి.ప్రశాంతి, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా జి.రాజకుమారి, కడప ఆర్డీవోగా పి.ధర్మచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీగా పృథ్వీ తేజ్ ఇమ్మడి బదిలీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+