వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో న్యాయ‌మూర్తి ఆమోదిస్తేనే కాంట్రాక్టు: దేశంలోనే మొద‌టి సారిగా..జ‌గ‌న్: కీల‌క బిల్లుల‌కు ఆమోదం..

|
Google Oneindia TeluguNews

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కీల‌క బిల్లుల‌ను ఏపీ శాస‌న‌స‌భ ఆమోదించింది. టెండ‌ర్లు..కాంట్రాక్టుల్లో దేశ చ‌రిత్రలోనే తొలి సారి సారిగా పార‌ద‌ర్శ‌క‌త‌కు ఏపి వేదిక కానుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పేర్కొన్నారు. దీనికి సంబం ధించిన న్యాయ స‌మీక్ష బిల్లును శాస‌న‌స‌భ ఆమోదించింది. దీంతో పాటుగా మ‌రో మూడు కీల‌క బిల్లును సైతం ఏపీ అసెంబ్లీ చ‌ర్చ త‌రువాత ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లుల చ‌ర్చ స‌మ‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వాకౌట్ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతిని ఎండ‌గ‌డుతూనే..బిల్లుల‌ను స్వాగ‌తించారు. సీఎం జ‌గ‌న్ బిల్లుల ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించారు.

పార‌ద‌ర్శ‌క‌త‌కు ఏపి నుండే నాంది..

పార‌ద‌ర్శ‌క‌త‌కు ఏపి నుండే నాంది..

ఏపీ లో తీసుకొచ్చిన న్యాయ స‌మీక్ష బిల్లు ద్వారా దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోంద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తోందని..వ్యవస్థలో మార్పు రావా లంటే ముందుగా ఎవరైనా ప్రారంభిస్తేనే వస్తుందని వివ‌రించారు.ముందస్తు న్యాయసమీక్ష అనేది ఇప్పటివరకూ దేశ చరిత్రలో ఎక్కడ జరుగలేదన్నారు. అది మన రాష్ట్రం నుంచే మొదలవుతుందని... పారదర్శకత అన్న పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే దేశం మొత్తం వ్యాపిస్తుందని వివ‌రించారు. దేశంలో ఎప్పుడు జరగని విధంగా.. అవినీతిని అంతమొందించేందుకు, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలని అడుగులు వేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేసారు.ఇక నుండి ఏపీలో 100 కోట్ల విలువైన ఏ కాంట్రాక్టు అయినా న్యాయ‌మూర్తి స‌మీక్ష త‌రువాతే ఖ‌రారు అవుతుంద‌ని.. ఆయ‌న‌కు స‌హాయంగా నిపుణులు అందుబాటులో ఉంటార‌ని చెప్పారు. ప‌బ్లిక్ డొమైన్‌లో ప్ర‌ద‌ర్శించిన త‌రువాత ఎవ‌రు దీని మీద స‌ల‌హాలు ఇచ్చినా ప‌రిశీలిస్తార‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌రించారు.

దేశంలోనే తొలి సారిగా..

దేశంలోనే తొలి సారిగా..

ఇటువంటి పార‌ద‌ర్శ‌క విధానం తొలి సారిగా ఏపీలోనే ప్రారంభించిన ఘ‌న‌త ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని వైసీపీ నేత‌లు అంబ‌టి రాంబాబు..భూమ‌న క‌రుణాక రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రిగిన అవినీతి కార‌నంగా రాష్ట్రం ఎంతో న‌ష్ట‌పోయింద‌ని చెప్పుకొచ్చారు. అంత‌కు ముందు మంత్రి బుగ్గ‌న ఈ బిల్లు తేవ‌టానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించారు. రాజ‌ధాని నిర్మాణం పేరుతో అయిన వారికి కాంట్రాక్టులు క‌ట్టబెట్టేందుకు స్విస్ ఛాలెంజ్ విధానం అందుబాటులోకి తెచ్చార‌ని..న్యాయ‌మూర్తి త‌ప్పుబ‌డితే చ‌ట్టాన్నే మార్చేసార‌ని ఎద్దేవా చేసారు. అదే స‌మ యంలో విదేశాల‌తో ఒప్పందాల పేరుతో ఏర‌కంగా దోపిడీ జ‌రిగిందీ బుగ్గ‌న క‌ధ‌ల రూపంలో వివ‌రించారు. ఈ బిల్లు ద్వా రా ఏ కాంట్రాక్టు అయినా పార‌ద‌ర్శ‌కంగా కేటాయింపు జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో వ్యవ‌సాయ మార్కెట్ క‌మిటీల‌కు ఎమ్మెల్యేల‌ను గౌర‌వ ఛైర్మ‌న్లుగా నియ‌మిస్తూ స‌వ‌ర‌ణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. అదే విధంగా ఈరైతుల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు వ‌చ్చేలా కొత్త స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించారు.

అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే బాబు భ‌యం..

అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే బాబు భ‌యం..

ప్ర‌జ‌ల సొమ్ముకు పూర్తి న్యాయం జ‌ర‌గాల‌నే ఉద్దేశంతోనే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ బిల్లును తీసుకొచ్చార‌ని సీనియ‌ర్ నేత భూమ‌న క‌రుణాక‌ర రెడ్డి చెప్పుకొచ్చారు. ఇటువంటి బిల్లు మీద చ‌ర్చ జ‌రుగుతుంటే ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు త‌న అవినీతి బ‌య‌ట‌ప‌డుతుంద‌నే పారిపోయార‌ని ఎద్దేవా చేసారు. 2014లో రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయ డానికి రూ. 17,500 కోట్లు సరిపోతాయని చెప్పిన చంద్రబాబు.. తన ఐదేళ్ల హయాంలో రూ. 63వేల కోట్లు ప్రాజెక్టులపై వెచ్చించామని ఎన్నికల ప్రచారం స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. చట్టం అవినీతిపరుల గుండెల్లో శరాఘాతమని, ఇక తప్పు చేయడానికి వీలులేకుండా ఉంటుందని క‌రుణాక‌ర రెడ్డి చెప్పుకొచ్చారు.

English summary
AP Assembly passed historical bills proposed by Govt. Judicial review and amendment bill in Agricultural markets. CM Jagan said that for transparent governance Govt introducing this bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X