Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీసీ జన గణనకు ఏపీ అసెంబ్లీ తీర్మానం- వెనుకబాటు గుర్తింపుకు తప్పదన్న జగన్

ఏపీలో బీసీ జనగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ఇవాళ ఓ తీర్మానం ఆమోదించింది. బీసీ కుల గణన చేపట్టకపోవడం వల్ల జరుగుతున్న నష్టంపై చర్చించిన రాష్ట్ర శాసనసభ.. ఈ మేరకు ఓ తీర్మానం చేసింది. త్వరలో దీన్ని కేంద్రానికి పంపబోతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు.

కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, నిజమైన జన గణన వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని వేణుగోపాల కృష్ణ అన్నారు.

ap assembly resolution for bc caste census, cm jagan says must for identification of backwardness

అనంతరం బీసీ జన గణనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం జగన్... 1931లో కులపరమైన జనాభా గణన జరిగిందని.. 90 ఏళ్లుగా కులపరమైనా జనాభా లెక్కలు లేవని తెలిపారు. అప్పటి నుంచి బీసీల జనాభా అందాజుగా లెక్కిస్తున్నారు తప్ప.. కచ్చితమైన లెక్క లేదన్నారు. దేశంలో బీసీల జనాభా 52 శాతం ఉందన్నారు. వెనుకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని జగన్ పేర్కొన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కులగణన జరగలేదన్నారు. దశాబ్దాలుగా సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ఎదగనివ్వడం లేదని సీఎం జగన్‌ తెలిపారు. జనాభాలో బ్యాక్ బోన్ అయిన బీసీల కోసం ఈ రెండున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని జగన్ గుర్తుచేశారు, ఆయా పథకాల వివరాలను సైతం జగన్ సభలో చదివి వినిపించారు. అనంతరం స్పీకర్ తమ్మినేని ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ ఓ ప్రకటన చేశారు. దీన్ని కేంద్రానికి పంపబోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+