అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం: తొలుత జగన్..తరువాత చంద్రబాబు..!
ఏపీలో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేతలు మారారు. దీంతో..ఈ సారి జరుగుతున్న అసెంబ్లీ సమావే శాల్లో ఆసక్తి కర దృశ్యాలు కనపించబోతున్నాయి. ఏపీ శాసనసభా సమావేశాలు అయిదు రోజులు జరగనున్నాయి. రెం డు రోజుల పాటు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాలు..స్పీకర్ ఎన్నిక..గవర్నర్ ప్రసంగం..ధన్యవాదాల తీర్మానం..ఇలా అయిదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. సమావేశాల తొలి రోజున ప్రతిపక్ష నేత చంద్రబాబు నూతన సీఎం జగన్‌ను అభినందించనున్నారు. రెండేళ్ల తరువాత వైసీపీ తొలిసారి సభలో ప్రవేశిస్తోంది.
తొలుత జగన్..తరువాత చంద్రబాబు
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమాశాలు ఉదయం 11.05 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి హోదాలో జగన్..ఆ తరువాత ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ప్రమాణం చేస్తారు.

ఆ తరువాత మొత్తం సభలోని ఎమ్మెల్యేలు అక్షర క్రమంలో ప్రమాణం చేస్తా రు. మధ్నాహ్నం రెండు గంటల వరకు సభ కొనసాగనుంది. మిగిలిన ఎమ్మెల్యేలతో 13న ప్రమాణం పూర్తి చేయిస్తారు. అదే రోజు కొత్త స్పీకర్‌గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆయన సభాపతి స్థానంలో ఆశీనులు అయిన తరువాత వైసీపీ..టీడీపీ నుండి స్పీకర్‌ను అభినందిచటంతో సభ 14వ తేదీకి వాయిదా పడుతుంది.
14న గవర్నర్ ప్రసంగం..
14న తేదీన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో ప్రకటించిన నవరత్నాలు..ఎన్నికల అంశాలకు గవర్నర్ ప్రసంగంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తరువాత 15, 16 తేదీల్లో సభకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. తిరిగి 17వ తేదీన సభ ప్రారంభమైన తరువాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన చర్చ ప్రారంభమవుతుంది.
అధికార-ప్రతిపక్ష పార్టీల నుండి సభ్యులు మాట్లాడిన తరువాత 18న సీఎం జగన్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో భాగంగా సమాధానం చెప్పనున్నారు. దీని ద్వారా తొలి విడత శాసన సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. శాసనసభా సమావేశాల కోసం ఇప్పటికే ఉన్నతాధికార - పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.












Click it and Unblock the Notifications