ఏపీ అసెంబ్లీ: భారీ భద్రత, వారు కూడా లోపలకు వెళ్లలేరు, మెడలో కెమెరాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండానే సమావేశాలు జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా, నేను గెలిస్తే: 'అమరావతి'పై జగన్ ఓపెన్ ఆఫర్, మోడీ-బాబు పొత్తుపై

 అవాంఛనీయ సంఘటనలు లేకుండా

అవాంఛనీయ సంఘటనలు లేకుండా

సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు, ఆందోళనలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

 నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు

నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు

అసెంబ్లీ వైపు వచ్చే అన్ని మార్గాల్లో భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్, పది కిలోమీటర్ల పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు. పోలీసు అధికారుల మెడలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.

 వీరికి మాత్రమే అనుమతి

వీరికి మాత్రమే అనుమతి

క్యూఆర్టీ బృందాలను రంగంలోకి దించారు. ప్రజాప్రతినిధుల డ్రైవర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది, అనుచరులను కూడా అసెంబ్లీలోకి అనుమతించడం లేదు. కేవలం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముందస్తు అనుమతులు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. 4వ నెంబర్ గేటు వద్ద మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు.

 చంద్రబాబు ఇలా

చంద్రబాబు ఇలా

కాగా, శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల సమయంలో అంబేడ్కర్‌ స్మృతివనంపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. అంబేడ్కర్‌ రాబోయే అన్ని తరాలకు ఆదర్శనీయులని, సమస్యలెన్ని వచ్చినా ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోలేదన్నారు. రూ.100కోట్లతో 20 ఎకరాల్లో 125వ జన్మదినం సందర్భంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంబేడ్కర్‌ తనకు స్ఫూర్తి అని ఎన్టీఆర్‌ ప్రకటించారని, ఆయనకు భారతరత్న ఇచ్చేలా కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌ అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Assembly sessions begun on friday. Chief Minister Nara Chandrababu Naidu talk about Dr BR Ambedkar.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి