• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారు

|

ప్రభుత్వ విధాన నిర్ణయాలు మొదలుకొని.. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, అమరావతి భూకుంభకోణంపై దర్యాప్తు లాంటి కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పులు, స్టే ఉత్తర్వులు, రద్దు నిర్ణయాలు ప్రకటిస్తుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నవేళ.. కోర్టుల తీరుపై బాహాటంగా విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న వైసీపీ నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ క్రమంలోనే చర్చను తారాస్థాయికి తీసుకెళుతూ.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమిత్ షాతో జగన్ సమావేశం - కోలుకున్నాక తొలి భేటీ ఏపీ సీఎంతోనే - ఏం మాట్లాడారంటే..

తీర్పులపై జనం తిరుగుబాటు..

తీర్పులపై జనం తిరుగుబాటు..

రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం వైసీపీ సర్కారు అద్భుతమైన పథకాలను రూపొందించిందని, అయితే కోర్టులు అడ్డుకుంటున్నందునే వాటిని అమలు చేసే పరిస్థితి లేదని స్పీకర్ సీతారాం అన్నారు. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ఎవరు అడ్డుకున్నా మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కోర్టుల తీర్పులు భరించలేక జనం ఏదో ఒక రోజు ఉద్యమిస్తారని, 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టలు ఇవ్వకుండా కోర్టు అడ్డుకుంటే పేదలు చూస్తూ ఊరుకోబోరని స్పీకర్ మండిపడ్డారు.

ఇక మేమంతా ఎందుకు?

ఇక మేమంతా ఎందుకు?

‘‘ప్రభుత్వ విధానాలపై కోర్టు జోక్యం దారుణం. రాజ్యాంగం ప్రకారం శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు వేటికవే స్వతంత్రమైనవి. కానీ ఒక వ్యవస్థలోకి ఇంకోటి చొరబడటం కచ్చితంగా తప్పే అవుతుంది. కోర్టుల జోక్యం ఇలాగే కొనసాగితే.. తామే ప్రభుత్వాన్ని నడిపించాలని న్యాయవ్యవస్థ భావిస్తే.. ఇక ఎమ్మెల్యేలు ఎందుకు? అసలు ఎన్నికలు ఎందుకు?'' అని తమ్మినేని ప్రశ్నించారు.

జగన్ అలా చేస్తే ప్రళయమే..

జగన్ అలా చేస్తే ప్రళయమే..

కోర్టుల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎందుకో మౌనం వహిస్తున్నారని, ఒకవేళ ఆయన మౌనం బద్ధలైతే ప్రళయం తప్పదని, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ఏపీ కోర్టులు ఇస్తున్న తీర్పులను బాధతోనే అంగీకరిస్తున్నామన్నారు. ఇటీవల కాలంలో ఏపీలోని కోర్టులు అనుసరిస్తున్న తీరు, విధానాలపై ప్రజలు, మేధాలువు చర్చించాలని స్పీకర్ కోరారు. ఒకవేళ వైసీపీ నిర్ణయాలు తప్పయితే ప్రజలే ఓడిస్తారని అన్నారు.

చంద్రబాబును మూసేయడం ఖాయం..

చంద్రబాబును మూసేయడం ఖాయం..

వైసీపీ ప్రభుత్వ విధానాలు, పథకాలకు అడ్డుపడుతోన్న కోర్టులు.. చంద్రబాబు అవినీతిపై దర్యాప్తును కూడా అడ్డుకుంటుండటం శోచనీయమని స్పీకర్ అన్నారు. అమరావతి కుంభకోణంలో చంద్రబాబు అండ్ కో బాగా బొక్కేశారని, 26 కేసుల్లో స్టే ఉత్తర్వులు తెచ్చుకున్న టీడీపీ అధినేతకు దమ్ముంటే ఆ కేసులపై విచారణ చేయించుకోవాలని తమ్మినేని సవాలు చేశారు. ‘‘చంద్రబాబును ఏక్షణంలో మూసేస్తారో తెలియదు. లేనిపోని వెధవ పనులు చేశారు కాబట్టే సీబీఐ విచారణకు ఆయన భయపడుతున్నారు'' అని సీతారాం అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి.. అమరావతి భూములు, ఫైబర్ గ్రిడ్ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తునకు రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ‘చంద్రబాబును ఎక్షణమైనా మూసేస్తారంటూ' స్పీకర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

కొడుకు భార్యతో రాసలీలలు - కుటుంబానికి మత్తుమందు - మామకోడలు జంప్ - సీసీటీవీలో..

English summary
AP Speaker Tammineni Sitaram once again made controversial remarks on the courts. He said, Unable to bear the judgments of the courts, one day the people will call for movement. Tammineni questioned courts, whether the poor would be deprived if 30 lakh people were prevented from being given house titles. 'if CM Jagan keeping silence is broken, catastrophe will come. Do not bring such a situation' he added
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X