విపక్షం లేకుండా అసెంబ్లీ: నా గొంతు కాదన్న జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రతిపక్షం లేకుండానే శుక్రవారం కొనసాగుతోంది. గురువారం జరిగిన రభస నేపథ్యంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఎనిమిది మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను సభనుంచి సస్పెండ్ చేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు శుక్రవారం నిరసనగా సభకు హాజరు కాలేదు. దీంతో శాసనసభలో అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రమే ఉన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టింది.
ఇదిలావుంటే, ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆ గొంతు తనది కాదంటూ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గురువారం జరిగిన పరిణామాలపై ఆయన ట్విట్టర్‌లో ప్రతిస్పందించారు. అసెంబ్లీలో పాలకపక్ష పరాకాష్టను ఆయన నిలదీశారు.
It was not my voice, my mike, that was cut. It was the Voice of the people, Your mike, that was cut!! 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 20, 2015 శాసనసభలో కట్ చేసింది తన మైక్ కాదనీ వారు ఆపేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుక అని ఆయన వ్యాఖ్యానించారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో వినిపించాల్సిన తన స్పందనను ఉదయం 11 గంటలకు మీడియా ముందు వినిపిస్తానని ఆయన చెప్పారు.
I will be presenting my reply to the #APBudget to the media at 11am today. This is AP democracy!! 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 20, 2015 
ఎపి శాసనసభలో తమ పార్టీ పట్ల అధికార తెలుగుదేశం పార్టీ సభ్యులు, స్పీకర్ వ్యవహరించిన తీరు పట్ల జగన్ గురువారం తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ప్రభుత్వ ప్రతినిధిలా సభను నడిపిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.
జగన్‌కు బిజెపి ఎమ్మెల్యే విజ్ఞప్తి
ప్రతిపక్షం అనేది సభలో ఉండాలని బిజెపి సభ్యుడు విష్షుకుమార్ రాజు శుక్రవారం శాసనసభలో అన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి అసెంబ్లీకి హాజరు కావపాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని, సభకు గైర్హాజర్ కావడంపై పునరాలోచన చేయాలని ఆయన కోరారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications