దండయాత్ర కాదు: బొత్స, ఎన్డీయే నుంచి బయటకే: మోడీకి టిడిపి షాక్

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: రేపటి (మంగళవారం నాటి) తమ బంద్ పిలుపు ఎవరి పైనో దండయాత్ర కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ సోమవారం నాడు అన్నారు. బంద్‌ను సీఎం చంద్రబాబు తప్పుపట్టిన నేపథ్యంలో బొత్స పైవిధంగా స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తేల్చి చెప్పకపోవడంపై వైసిపి బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో బొత్స ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అందరూ బందును విజయవంతం చేయాలన్నారు. వివిధ పార్టీలు, కార్మిక, వాణిజ్య.. ఇలా ఎన్నో సంఘాలు మద్దతిచ్చాయని చెప్పారు.

నిద్రపోయారా: 'హోదా'లోకి చిరంజీవిని లాగిన బీజేపీ మంత్రి మాణిక్యాల
మనకు ఉద్యోగాలు రావాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి జరగాలన్నా ప్రత్యేక హోదా రావాలన్నారు. రాష్ట్రానికి హోదా కచ్చితంగా రావాలన్నారు. ఏపీకీ బంద్, హోదా కోసం ఉద్యమం ఎవరి పైనో దండయాత్ర కాదని, భవిష్యత్తు తరాల కోసమన్నారు. హోదా రాకుంటే రాష్ట్రం ఏడారి అవుతుందన్నారు.

కేంద్రం మెడలు వంచేందుకు రేపు ఏపీ బందుకు వైసిపి పిలుపునిచ్చిందని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయన్నారు. రేపు ప్రజలు కూడా తమ గొంతు వినిపించాలన్నారు. మన హక్కుల కోసం మనమే పోరాడాలన్నారు.

వైసిపి ఇచ్చిన రేపటి బంద్‌కు సహకారం అంటే రాజకీయ సహకారం కాదని, మన కోసం మనం సహకరించుకోవడం అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు అన్ని వర్గాలు కలిసి రావానల్నారు. మేథావులు తమ గొంతు వినిపించాలన్నారు. కార్మిక, విద్యార్థి సంఘాలు, యువత అందరూ బందులో పాల్గొనాలన్నారు.

AP Bandh on August 2: Botsa calls upon everyone to rise above politics on Special Status

వైసిపికి ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీలో ధర్నా చేశామని, సభలో ఆందోళనలు నిర్వహించామన్నారు. గుంటూరులో తమ పార్టీ అధినేత వైయస్ జగన్ దీక్ష చేశారన్నారు. హోదా పైన బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నదే తమ డిమాండ్ అన్నారు.

చంద్రబాబు ఆదేశం, టిడిపి ఎంపీలతో సభలో గందరగోళం, వెల్లోకి వైసిపి
హోదా ఇవ్వలేమని జైట్లీ చెబితే టిడిపి ఎంపీలు పార్లమెంటులో ఎలా స్పందించారో అందరూ చూశారన్నారు. చంద్రబాబుకు తాను అనుభవజ్ఞుడిని అని గొప్పలు చెప్పుకోవడానికే సరిపోయిందన్నారు. చంద్రబాబు ఆలోచనలో మార్పు రావాలన్నారు. చంద్రబాబు జర్మనీ, జపాన్ అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీకి మంత్రుల హెచ్చరిక

తమకు మిత్రపక్షం కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం నాడు అన్నారు. అవసరమైతే ఎన్డీయే నుంచి బయటకు వచ్చేందుకు తాము సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా గురించి జగన్ ఎప్పుడైనా ప్రధాని మోడీని ప్రశ్నించారా అని నిలదీశారు.

కేంద్రం స్పందించకుంటే: పత్తిపాటి

ప్రత్యేక హోదా పైన కేంద్రం స్పందించకుంటే తాము ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటామని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజల ఆగ్రహానికి గురికాకముందే బీజేపీ ప్రత్యేక హోదా పైన నిర్ణయం తీసుకోవాలన్నారు. లేదంటే ఎటువంటి నిర్ణయమైనా తమ పార్టీ తీసుకుంటుందన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party leader Botsa Satyanarayana calls upon everyone to rise above politics on Special Status.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి