వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి భ‌వ‌న్ లోనే దీక్ష ఎందుకు : టిడిపికి ఎలా క‌ల‌సొచ్చింది : ఏంటీ సెంటిమెంట్‌..!

|
Google Oneindia TeluguNews

ఏపి ముఖ్య‌మంత్రి చంద్రబాబు కేంద్ర వైఖ‌రి కి నిర‌స‌న‌గా ముఖ్య‌మంత్రి హోదాలో ఢిల్లీలో దీక్ష ప్రారంభించారు. దీని కోసం ఏపి భ‌వ‌న ను వేదిక‌గా ఎంచుకున్నారు. ఇది ఏపికి సంబంధించిన ప్రాంగ‌ణం అనేదే కాదు..ఏపి భ‌వ‌న్ కు టిడిపి రాజ‌కీయాల‌కు అవినాభావ సంబంధం ఉంది. టిడిపికి ఏపి భ‌వ‌న్ ఎలా అచ్చొచ్చింది...

దీక్ష వేదిక‌గా ఏపి భ‌వ‌న్‌..

దీక్ష వేదిక‌గా ఏపి భ‌వ‌న్‌..

పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో..ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు ఢిల్లీలో దీక్ష‌కు దిగారు. జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ఆయ‌న దీక్ష నిర్వ‌హిస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని..ప్ర‌ధానంగా ప్ర‌ధాని మోదీ విధానాల‌ను ఎండ‌గ‌డుతూ సీయం ఈ దీక్ష చేస్తున్నారు. అయితే, చంద్ర‌బాబు త‌న దీక్ష కోసం ఏపి భ‌వ న్ ను ఎంచుకోవ‌టం వెనుక సెంటిమెంట్ దాగి ఉంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌... అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తెలుగుదేశం పార్టీ భవిష్యత్‌నూ, జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ పాత్ర‌ను తీర్చిదిద్దడంలోనూ కీలక పాత్ర పోషిం చింది. దీనిని దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్ర‌భుత్వం ఏపికి చేసిన అన్యాయానికి నిరసనగా శంఖారావం పూరించడానికి, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను సంఘటితం చేయడానికి ఏపీ భవన్‌ను వేదికగా ఉపయోగించాలని సీఎం చంద్రబా బు నిర్ణయం తీసుకున్నారు.

చ‌రిత్ర‌లోనూ ఇదే వేదిక‌గా..

చ‌రిత్ర‌లోనూ ఇదే వేదిక‌గా..

1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏపీ భవన్‌లోనే పురుడు పోసుకుందని చెప్పవచ్చు. అప్పటి ఎన్నికల్లో ఏ పార్టీకీ తగినంత మెజారిటీ రానప్పుడు 13పార్టీలు ఏకమయ్యేందుకు, వాటితో వామపక్షాలు జత కట్టేందుకు ఇక్కడ జరిగిన చర్చలే కారణమయ్యాయి. అప్పటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడే ఈ చర్చల్లో కింగ్‌మేకర్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌రువాత 2014 లో రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ ఇక్క‌డే ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వారం రోజుల పాటు దీక్ష చేసారు. ఇక‌, ఇప్ప‌డు చేస్తున్న ధర్మపోరాట దీక్ష కూడా జాతీయ రాజకీయాల్లో కీల‌కంగా మారుతోంది. ధర్మ పోరాట దీక్షకు దాదాపు 23పార్టీల నేతలు హాజరై సంఘీభావం ప్రకటించనుండటం ప్రతిప క్షాలు సంఘటితమయ్యేందుకు మ‌రోసారి వేదిక‌గా మార‌నుంది.

ఫ్రంట్ ల ఏర్పాటుకు కేంద్రంగా..

ఫ్రంట్ ల ఏర్పాటుకు కేంద్రంగా..

ఏపి భ‌వ‌న్ ఇప్పుడే కాదు జాతీయ రాజ‌కీయాల్లో ఎన్నో కీల‌క ఘ‌ట్టాల‌కు వేదిక‌గా నిలిచింది. 1989లో ఎన్టీఆర్‌ నేతృత్వం లో ఏడు పార్టీలతో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పడినప్పుడు అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏపీ భవన్‌నే వేదికైంది. ఇక్కడి గురజాడ కాన్ఫరెన్స్‌ హాల్‌, అంబేద్కర్‌ ఆడిటోరియంలో కీలక రాజకీయ చర్చలు జరిగాయి. 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం .. ఇప్పుడు మోదీ సారథ్యం లోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు చంద్రబాబు కూడా ఇదే ఏపీ భవన్‌ను వేదిక చేసుకున్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఈ వేదిక కేంద్రంగా నాటి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా దీక్ష‌లు జ‌రిగితే..ఇప్పుడూ అవే స‌మ‌స్య‌ల పై ఎన్టీఏ ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా దీక్ష ప్రారంభించారు.

English summary
Cm Chandra Babu Deekhsa started at AP Bhavan in New Delhi. In past in AP Bhavan many key political developments take place. United Front formed in AP bhavan. In 2014 Babu Hunger Strike took place in this place. Now once again anti central govt moment Deekhsa from here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X