కిరణ్ రెడ్డితో పార్టీ పెట్టించి...: చంద్రబాబుపై చిందులేసిన బొత్స

Recommended Video

    Andhra Pradesh Bifurcation : చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆడిన నాటకం

    విశాఖపట్నం: రాష్ట్ర విభజనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజనలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ఆయన విరుచుకుపడ్డారు.

    రెండు కళ్ల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఆడిన నాటకం కారణంగానే రాష్ట్రం విడిపోయిందని ఆయన శుక్రవారం విశాఖపట్నంలో ఆరోపించారు. రెండు కళ్ల సిద్ధాంతం పేరిట రాష్ట్ర విభజనలో కీకల పాత్ర పోషించిన చంద్రబాబు ఇప్పుడు ఇతర పార్టీల నిందిస్తున్నారని ఆయన అన్నారు.

    అది చంద్రబాబు నైజాన్ని చాటుతోందని ఆయన అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్ర విభజన అంశాన్ని చక్కగా వాడుకుని అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నరని ఆయన అన్నారు.

    ఇలా అనుకూలంగా

    ఇలా అనుకూలంగా

    కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర విభజన అంశంపై అఖిలపక్ష సమావేశంలో అప్పటి టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత అశోక్ గజపతి రాజు, మోత్కుపల్లి నర్శింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తదితరులచే అసెంబ్లీలో తీర్మానానికి అనుకూలంగా వ్యవహరించాలని చెప్పలేదా అని బొత్స చంద్రబాబును ప్రశ్నించారు.

    ఎర్రనాయుడి ద్వారా లేఖ..

    ఎర్రనాయుడి ద్వారా లేఖ..

    విభజన అంశానికి సంబంధించి పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ద్వారా కేంద్రానికి లేఖ పంపిన విషయాన్ని చంద్రబాబు గుర్తుకు తెచ్చుకోవాలని బొత్స అన్నారు. ఈ అంశాలు చోటుచేసుకున్నప్పటికి వైసీపీ పార్టీ పుట్టలేదనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలని అన్నారు. విభజన ఉద్యమం జోరుగా జరుగుతున్న తరుణంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆఖరి బంతి తన చేతిలోనే అంటూ మభ్యపెట్టడం వెనుక మీ రాజకీయ చతురత ఉందని ఆరోపించారు.

    కిరణ్‌రెడ్డితో పార్టీ పెట్టించి...

    కిరణ్‌రెడ్డితో పార్టీ పెట్టించి...

    కిరణ్‌కుమార్ రెడ్డితో రాజకీయ పార్టీ పెట్టించి, ఓట్లను చీల్చి అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వాడుకున్నారని ఆయన దుయ్యబట్టారు. విభజన సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన అంశాలను చట్టంలో పెట్టించినా కూడా అధికారంలోకి వచ్చిన తరువాతే వాటిని తుంగలోకి తొక్కించారని బొత్స ఆరోపించారు. ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ వంటి అంశాలు బీజేపీ వద్ద తాకట్టుపెట్టి రాజకీయ స్వలాభం చూసుకున్నారని ఆరోపించారు.

    నెపం జగన్ మీదికా....

    నెపం జగన్ మీదికా....

    కిరణ్‌కుమార్ సోదరుడు తెలుగుదేశం పార్టీలో చేరితే, విభజన పాపాన్ని తమ పార్టీపైకి నెట్టేందుకు వెనుకాడని చంద్రబాబు రాజకీయం జనం గమనిస్తున్నారని బొత్స అన్ారు. చంద్రబాబు మాదిరి టక్కుటమార రాజకీయాలు ప్రపంచంలోనే ఎవరూ చేయరని ఆయన అన్నారు. తమ పార్టీని వీడి వెళ్తున్న ఎమ్మెల్యేలు రాష్ట్భ్రావృద్ధి కోసమే టీడీపీలో చేరుకుతున్నట్టు చెప్పడాన్ని ఆయన ఖండించారు. ఇప్పటి వరకూ పార్టీ మారిన ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+