బలముంటే దౌర్జన్యాలెందుకు ? వైసీపీకి సోము వీర్రాజు సూటిప్రశ్న-నెల్లూరులో టీడీపీతో కుమ్మక్కు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఓవైపు వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ, ప్రజా బలముందని చెప్పుకుంటూ విపక్షాలపై దౌర్జన్యాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే విపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో పోలీసుల సాయంతో వైసీపీ దౌర్జన్యాలపై విమర్శలు వినిపిస్తుండగా.. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం వైసీపీ సర్కార్ ను ఇదే అంశంపై నిలదీశారు.

ఓవైపు ప్రజల్లో బలముందని చెప్పుకుంటూ ఈ దౌర్జన్యాలేంటని సోము వీర్రాజు ఇవాళ నెల్లూరులో వైసీపీని ప్రశ్నించారు.
నెల్లూరు మేయర్ స్థానాన్ని తామే కైవసం.చేసుకుంటామని సోము తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పక్షంతో ప్రతిపక్ష టిడిపి కుమ్మక్కైందని ఆయన ఆరోపించారు. బద్వేలు ఎన్నికల్లో టిడిపి పోటీ.చేయలేక.చేతులెత్తేసిందన్నారు. అన్ని చోట్లా టిడిపి పోటీపడలేక వెనకబడుతోందన్నారు..

ap bjp chief ask straight question to ysrcp, have public strength, why attrocities in local polls ?

స్థానిక సంస్థల అభివృద్ధి లో మీ భాగస్వామ్యం ఏమిటిని వైసీపీ సర్కార్ కు సోము వీర్రాజు సూటి ప్రశ్న వేశారు. మీకు ప్రజాబలం ఉంటే ప్రజాస్వామ్య బద్దంగా ఎందుకు ఎన్నికలు జరపడం లేదని ప్రశ్నించారు. గుంటూరు జిల్లా కారంపూడి లో అభ్యర్థికి ఎన్వోసీ ఇవ్వకుండా దారుణాలకు పాల్పడ్డారని సోము ఆరోపించారు. అధికారులు ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మీకు జీతాలు ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాదు.. ప్రభుత్వమని గుర్తుంచుకోవాలన్నారు.
స్థానిక సంస్థల్లో కేంద్రం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు తెలిపారు.
నెల్లూరు కార్పొరేషన్ కి ప్రతి యేటా తలకు 640 రూ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ప్రతి యేటా 5 కోట్లు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అమృత్ పధకం కింద నెల్లూరుకి రూ.1150 కోట్లు నిధులు కేటాయించినట్లు సోము గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మీ భాగస్వామ్యం ఏముందని వైసీపీని ప్రశ్నించారు. దీనికి సీఎం జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+