Daggubati Purandeswari: చంద్రబాబు బెయిల్ పై పురందేశ్వరి రియాక్షన్ ఇదే-అది కరెక్ట్ కాదు..!
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి 53 రోజులుగా రాజమంండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుపై పలువురు స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ బీజేపీ అధినేత్రి దగ్గుబాటి పురందేశ్వరి కూడా మాట్లాడారు.
చంద్రబాబు బెయిల్ పై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. దీన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము ముందే తప్పు పట్టామని పురందేశ్వరి గుర్తుచేశారు. నోటీసులివ్వకుండా.. విచారణ జరపకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని మేం గతంలోనే తప్పు పట్టినట్లు పురందేశ్వరి పేర్కొన్నారు. ఎఫ్ఐఆరులో పేరు లేకుండానే అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదన్నారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం మంచిదేనని పురందేశ్వరి తెలిపారు..

చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై అప్పట్లోనే స్పందించిన పురందేశ్వరి దీన్ని ఖండించారు. అయితే ఆ తర్వాత మాత్రం కాస్త సైలెంట్ అయ్యారు. తిరిగి తమ పార్టీ అధిష్టానానికి చంద్రబాబు అరెస్టు, అనంతర పరిస్ధితుల్ని వివరించారు. ఆ తర్వాత నారా లోకేష్ ను తీసుకెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడించారు. ఇందులోనూ అమిత్ షా చంద్రబాబు అరెస్టుపై విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి మాట్లాడిన పురందేశ్వరి.. చంద్రబాబు బెయిల్ ను స్వాగతించారు. ఈ మధ్యలోనే వైసీపీ నేతలు పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications