టీడీపీతో పొత్తుపై బీజేపీలో చీలిక ? జనం కోరిక అదేనంటున్న విష్ణుకుమార్ రాజు-సునీల్ కు ఝలక్ !
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై పోరుకు విపక్షాల్ని ఏకం చేసేందుకు ఓవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటే మరోవైపు ఆ పార్టీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ మాత్రం అందుకు విరుద్ధంగా టీడీపీతో పొత్తు పెట్టుకోబోమని ప్రకటనలు చేస్తున్నారు. ఇదే అంశంపై పవన్ కూడా తన అసంతృప్తికూడా వ్యక్తంచేసారు. అయినా బీజేపీ నేతల్లో మార్పు కనిపించడం లేదు. అయితే ఈ విషయంలో బీజేపీలో కూడా ఏకాభిప్రాయం లేదు. టీడీపీతో పొత్తును కోరుకుంటున్న బీజేపీ నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు
ఏపీలో ఒకప్పటి మిత్ర త్రయం టీడీపీ-బీజేపీ-జనసేన మరోసారి పొత్తు పెట్టుకుంటాయా లేదా అన్న దానిపై ఇప్పుడు రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతోంది. విపక్షాల్లోనే కాదు అధికార పార్టీ వైసీపీలోనూ ఇదే చర్చ కొనసాగుతోంది. టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైనట్లు భావిస్తున్నట్లు వారంతా ఇప్పుడు బీజేపీ వీరితో కలిసి ముందుకు సాగుతుందా, వీరు బీజేపీతో కలిసి ముందుకెళ్లాలనుకుంటున్నారా లేదా అనే దానిపై చర్చించుకుంటున్నారు. తాజాగా పవన్-చంద్రబాబు భేటీ తర్వాత మొదలైన ఈ చర్చ ఇప్పుడు రోజుకో మలుపు తిరుగుతోంది.

టీడీపీతో పొత్తు లేదన్న సునీల్ దేవధర్
ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి టీడీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం లేదని, ఆ పార్టీతో మాకు చేదు అనుభవాలు ఉన్నాయని పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ తాజాగా మరోసారి కుండబద్దలు కొట్టేశారు. పొత్తులపై ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా చెప్పేశారు. దీంతో టీడీపీతో పొత్తుపై సునీల్ దేవధర్ వ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలైతే సునీల్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.

జనం కోరిక అదేనన్న విష్ణుకుమార్ రాజు
మరోవైపు బీజేపీ మాజీ ఎమ్మెల్యే, పార్టీలో సీనియర్ నేత కూడా అయిన విష్ణుకుమార్ రాజు టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తును జనం కోరుకుంటున్నారని తాజాగా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 90-95 శాతం మంది ఈ మూడు పార్టీలు కలిసి రావాలని కోరుకుంటున్నారన్నారు. ఇది రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ సునీల్ దేవధర్ కు తెలియనిది కాదన్నారు. అంతే కాదు పొత్తుల్ని డిసైడ్ చేయాల్సింది జాతీయ పార్టీయేనని, అమలుచేసేది రాష్ట్ర పార్టీ అన్నారు. తద్వారా పొత్తులపై సునీల్ దేవధర్, సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలు ఫైనల్ కాదని ఆయన చెప్పినట్లయింది.

టీడీపీతో పొత్తుపై బీజేపీలో చీలిక ?
రాష్ట్రంలో విశాఖ ఘటన తర్వాత తాజాగా మారిన పరిస్దితుల్లో టీడీపీతో పొత్తుపై ఇతర విపక్షాలు ఆలోచనలో పడ్డాయి. టీడీపీ వంటి బలమైన విపక్షంతో పొత్తు పెట్టుకుంటే రాబోయే ఎన్నికల్లో తమకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నాయి. జనసేనతో పాటు బీజేపీలోని ఓ వర్గం పొత్తు ఉండాల్సిందేనంటోంది. కానీ మరో వర్గం మాత్రం టీడీపీపై తమ వైఖరి మారలేదని, భవిష్యత్తులో టీడీపీతో పొత్తు పెట్టుకోబోమని బహిరంగంగానే చెబుతోంది. దీంతో ఇప్పుడు జాతీయ నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్దితి. హైకమాండ్ నుంచి దీనిపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీతో పొత్తుపై బీజేపీ నేతలు ఎవరికి వారు ప్రకటనలు చేసేస్తున్నారు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications