వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్ర‌బాబు అవినీతిపై చ‌ర్య‌ల బాధ్య‌త జ‌గ‌న్‌దే: పూర్తి స‌మాచారం సీఎంకు అందిస్తాం: తేల్చేసిన బీజేపీ..

|
Google Oneindia TeluguNews

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అవినీతి కేసుల విచార‌ణ బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిదే అంటూ బీజేపీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ దియోధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రబాబు ఒక గజదొంగ అని, రాష్ట్రాన్ని దోపిడీ చేశారని తీవ్ర ఆరోపణ లు చేశారు. త్వరలోనే అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కొంత కాలంగా చంద్ర‌బాబు త్వ‌ర‌లో జైలుకు వెళ్ల‌టం ఖాయ‌మ‌ని వ్యాఖ్యానించిన ఇదే నేత ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాని దే బాధ్య‌త అని చెప్ప‌టం ద్వారా కొత్త చ‌ర్చ మొద‌లైంది. దీంతో..ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వం చేస్తున్న విచార‌ణ‌ల‌కు ఒక వైపు అడ్డు ప‌డుతూ..మ‌రో వైపు రాష్ట్ర ప్ర‌భుత్వానిదే బాధ్య‌త అని చెప్ప‌టం పైనే అంద‌రి దృష్టి నెల‌కొంది.

Recommended Video

ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎవరు చూసి ఉండరు : జగన్
చంద్ర‌బాబు అవినీతి విచార‌ణ బాధ్య‌త జ‌గ‌న్‌దే..

చంద్ర‌బాబు అవినీతి విచార‌ణ బాధ్య‌త జ‌గ‌న్‌దే..

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దియోధర్ అస‌లు విష‌యం తేల్చేసారు. ఇప్పటి వ‌ర‌కు చంద్ర‌బాబు అవినీతి పైన చూస్తూ ఊరు కోమ‌ని..ఖ‌చ్చితంగా త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు జైలుకు వెళ్తార‌నే ఇదే దియోధర్ ప‌లుమార్లు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టారు. చంద్రబాబుకు సంబంధించిన అవినీతి కేసులను బయటకు తీసి విచారించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని అన్నారు. త్వరలోనే అవినీతి కేసులకు సంబంధించిన నివేదికను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. అవినీతికి పాల్పడిన నేరస్తులు ఏ పార్టీలో ఉన్నా శిక్షించాల్సిందేనని వ్యాఖ్యానిం చారు. కేంద్రం వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 2024 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయ పార్టీగా మారుతుందన్నారు.

 జ‌గ‌న్ నిబ‌ద్ద‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు...

జ‌గ‌న్ నిబ‌ద్ద‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారు...

బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దియోధర్ ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పైనా కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. రాష్ట్రాన్ని అవినీతిరహిత రాష్ట్రంగా మార్చడానికి జగన్ నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. టీడీపీ చేసిన అవినీతిని వెలికితీయా లని అనేక మీడియా సమావేశాల ద్వారా జగన్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. చంద్రబాబుపై ఎవరికీ విశ్వాసం లేదన్నారు. అందుకే ఆయనపై సొంత పార్టీ ఎంపీ ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఖతం అయి పోయిందని, ప్రతిపక్ష పార్టీ శూన్యతను బీజేపీ త్వరలోనే భర్తీ చేస్తుందన్నారు. అప్పటి అవినీతి ప్రభుత్వం.. బీజేపీతో సంబంధాలు తెంచుకోవడం తమకు ఆనందాన్నిచ్చిందన్నారు. ఒక వైపు పార్టీ సీనియ‌ర్ నేత రాం మాధ‌వ్ జ‌గ‌న్ పాల‌న తో మ‌రింత న‌ష్ట‌పోతామ‌నే అభిప్రాయం క‌లుగుతుంటూ వ్యాఖ్యానిస్తుంటే..ప‌క్క జిల్లాలోనే ఉన్న బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ జ‌గ‌న్ పాల‌న‌ను అభినందిస్తున్నారు. చివ‌ర‌కు ఆయ‌న చంద్ర‌బాబు పైన విచార‌ణ బాధ్య‌త త‌మ‌ది కాద‌ని.. అది జ‌గన్‌దే అంటూ తేల్చేసారు.

ఏంటీ అస‌లు వ్యూహం..

ఏంటీ అస‌లు వ్యూహం..

ఇక వైపు జ‌గ‌న్ గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అవినీతి పైన విచార‌ణ చేస్తుంటే కేంద్రం స‌హ‌క‌రించ‌టం లేదు. పీపీఏల విష‌యంలో కేంద్రం పూర్తిగా స‌హాయ నిరాక‌ర‌ణ చేయ‌టంతో పాటుగా రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వ తీరు ఇలా ఉంటే.. పార్టీ నేత‌లు మాత్రం తామే ఏపీ ప్ర‌భుత్వానికి పూర్తి స‌మాచారం అందిస్తామ‌ని..చంద్ర బాబు అవినీతి పైన విచారించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెబుతున్నారు. దీని ద్వారా వారు వ్యూహాత్మ‌కంగానే తాము చంద్ర‌బాబును వేధిస్తున్నామ‌నే భావ‌న రాకుండా..జ‌గ‌న్ ద్వారానే విచార‌ణ‌లు చేయించాల‌ని భావిస్తున‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ దియోధర్ వ్యాఖ్య‌ల మీద టీడీపీ.. వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

English summary
AP BJP Incharge Theodhar sensational comments on Chandra Babu. He says Chandra Babu stolen AP Public money. AP Govt to take steps against Chandra Babu corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X