వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీయే కాదు.. అమెరికా అధ్యక్షుడు చెప్పినా వీరు మారరు??

|
Google Oneindia TeluguNews

ప్రధానమంత్రి నరేంద్రమోడీయే కాదు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పినా వారు మారరు. అంతే.. వారి విధానాలు వారివే.. వారి ప్రయోజనాలు వారివే.. వారి లక్ష్యాలు వారివే.. ఏవీ కూడా పార్టీవి మాత్రం ఉండవు. వారంతా ఎవరోకాదు.. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతాపార్టీకి చెందిన రాష్ట్ర నేతలు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి రాష్ట్ర నేతలతో సమావేశమై పార్టీ కార్యకలాపాల గురించి ఆరా తీశారు. అయితే ప్రధానమంత్రి సంతృప్తిచెందే రీతిలో వారి పనులుకానీ, వారి మాటలుకానీ లేకపోవడంతో మోడీ క్లాస్ తీసుకున్నారు.

యువతరం ఓట్లే కీలకం

యువతరం ఓట్లే కీలకం

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఆలంబనగా చేసుకొని అధికారానికి చేరుకోవాలని, కానీ ఏపీలో ప్రజల్లోకి బలంగా ఆ విధానాలను ఎందుకు తీసుకువెళ్లేకపోతున్నారని ప్రశ్నించారు. వారి నుంచి సమాధానం కరవు. మోడీ కోర్ కమిటీకి దిశా నిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములను పక్కనపెట్టి నిరంతరం ప్రజల్లో ఉండేటట్లుగా కార్యక్రమాలకు రూపకల్పన చేసుకోవాలన్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా ఎంచుకోవాలని, వారి ఓట్లే రానున్న ఎన్నికల్లో కీలమవుతాయని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది.

మోడీ చెప్పినట్లు చేస్తారా?

మోడీ చెప్పినట్లు చేస్తారా?


మోడీ తీసుకున్న క్లాప్ పై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్ లాంటి అగ్రనేతలంతా ఇప్పటివరు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం ఒక్కటి కూడా చేయలేదు. వీరిలో సత్యకుమార్ మాత్రం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ట్వీట్ చేస్తుంటారు. వైసీపీ నేతలతో సత్సంబంధాలున్నాయనే విషయంలో ఏపీలో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మోడీ చెప్పినదాని ప్రకారం చేస్తారా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా నిలిచింది.

పురంధేశ్వరిని జేపీ నడ్డాతో మాట్లాడమని చెప్పిన ప్రధాని

పురంధేశ్వరిని జేపీ నడ్డాతో మాట్లాడమని చెప్పిన ప్రధాని

పురంధేశ్వరి కుమారుడికి టీడీపీ తరఫున టికెట్ ఇస్తున్నారనే ప్రచారం బీజేపీలో జరుగుతోంది. దీంతో కీలకమైన బాధ్యతలను ఆమెకు అప్పగించడంలేదు. ఇదే విషయాన్ని మోడీకి చెప్పగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాలని సూచించారు. ప్రధాని పర్యటన ముగిసి నాలుగురోజులవుతున్నప్పటికీ ఇంతవరకు ఆయన చెప్పినట్లుగా కనీసం ఒక్క కార్యక్రమానికి కూడా రూపకల్పన చేయలేకపోయారు. భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేస్తారనే ఆశతో బీజేపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. అవి ఎదురుచూపులుగానే మిగలకుండా పార్టీకి నూతన ఉత్తేజం కల్పించాల్సిన బాధ్యత స్థానిక నాయకత్వంపైనే ఉంది.

English summary
Not only Prime Minister Narendra Modi.. They will not change even if US President Joe Biden says so.That's it.. Their policies are theirs.. Their interests are theirs.. Their goals are theirs.. There is no party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X