చంద్రబాబు నెత్తిన మరో పిడుగు..పొత్తులో కొత్త ట్విస్ట్..?
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పోలింగ్ తేదీ ఖారారు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కురుక్షేత్రానికి రెడీ అవుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన , బీజేపీ కూటమి కట్టాయి. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలతో పాటు, రెండు పార్లమెంట్ స్థానాలను కేటాయించగా, బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లతో పాటు, 6 లోక్‌సభ స్థానాలను కేటాయించారు.
మిగిలిన స్థానాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలోకి దిగనుంది. అయితే బీజేపీకి కేటాయించిన స్థానాలపై ఆ పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. 6 లోక్‌సభ స్థానాలను గురించి పెద్దగా సమస్య రాకపోయినప్పటికీ , అసెంబ్లీ స్థానాల్లోనే బీజేపీ క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.పాడేరు, అనపర్తి, ఆదోని వంటి నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించడంపై పార్టీ నాయకులు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలవలేదు కాబట్టే.. వాటిని తమకు కేటాయించారని బీజేపీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కొన్ని సీట్ల విషయంలో చేర్పులు మార్పులు చేయాలని నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. పైగా అక్కడ పార్టీకి సరైన క్యాడర్ లేదని బీజేపీ నాయకులు చెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున హైకమాండ్‌కు లేఖలు కూడా రాసినట్లు తెలుస్తోంది.
దీనికి తోడు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీకి కేటాయించిన స్థానాలన్నీ కూడా వైసీపీ కంచుకోటలని.. అక్కడ టీడీపీ కూడా విజయం సాధించలేదని అందుకే ఆ స్థానాలను బీజేపీకి కేటాయించారని రాష్ట్ర బీజేపీ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం. బీజేపీ అభ్యర్థుల గెలుపుకు టీడీపీ సహకరించదన్న ప్రచారం కూడా ఉంది.
అవసరమైతే వారే పనిగట్టుకుని బీజేపీ అభ్యర్థులను ఓడిస్తారనే అనుమానాలు రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా బీజేపీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై చర్చించేందుకే పార్టీ పెద్దలు పురందేశ్వరిని ఢిల్లీకి పిలిపించారని సమాచారం.ఒకటి , రెండు రోజుల్లో బీజేపీ సీట్ల విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ బీజేపీ తమకు కేటాయించిన స్థానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తే ..అది టీడీపీ అధినేతకు మరో తలపోటుగా మారినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ కోరుకున్న చోట సీట్లు ఇచ్చే పరిస్థితిలో ప్రస్తుతం చంద్రబాబు లేరు. ఇప్పటికే తొలి నుంచి పార్టీలో ఉన్నవారికి సీట్లు ఇవ్వలేదని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థుతుల్లో ఇప్పుడు బీజేపీ కోరిన చోట సీట్లు కేటాయించడం అంటే అది చంద్రబాబుకు పెను సవాలే. మరీ ఈ విపత్కర పరిస్థితులను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.












Click it and Unblock the Notifications