వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

AP budget 2020 : 2.24 లక్షల కోట్లు.. బడ్జెట్ ఘనమే.. మరి ఆదాయం? క్లారిటీ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికిగానూ 2020- 21 బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2,24,798.18 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన , మొత్తం రెవెన్యూ వ్యయం అంచనా రూ 1,80,392.65 కోట్లుగా తేల్చారు. ఇక గతేడాది రెవెన్యూ వ్యయం విషయానికి వస్తే రూ.1,37,518.07 కోట్లు మాత్రమే. ఇక ఈ ఏడాది కరోనా లాక్డౌన్ ప్రభావంతో నాలుగు నెలలపాటు పూర్తిగా ఆదాయం పడి పోయినప్పటికీ రెవెన్యూ వ్యయాన్ని 45వేల కోట్ల వరకూ పెంచి చూపించారు. ఇక అన్నిటికంటే భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం ఆదాయ వనరుల గురించి మాత్రం బడ్జెట్లో చెప్పలేకపోయింది.

AP Budget 2020 Sessions: బడ్జెట్ హై లైట్స్ ఇవే ..మంత్రి బుగ్గన ప్రసంగం సాగిందిలా !!AP Budget 2020 Sessions: బడ్జెట్ హై లైట్స్ ఇవే ..మంత్రి బుగ్గన ప్రసంగం సాగిందిలా !!

 బడ్జెట్ లో ఘనంగా నిధుల కేటాయింపు

బడ్జెట్ లో ఘనంగా నిధుల కేటాయింపు

2019- 2020 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు 26,646.92 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక ఆర్థిక లోటు రూ.40,493.46కోట్లుగా ఉంది. ఇక గత రెవిన్యూ లోటును, ఆర్థిక లోటును ఎట్లా భర్తీ చేస్తారో చెప్పని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంక్షోభ సమయంలోనూ సంక్షేమం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రసంగమంతా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ, ఘనంగానే నిధుల కేటాయింపులు చేస్తూ సాగింది .

ఆర్ధిక వనరుల విషయం ప్రశ్నార్ధకమే

ఆర్ధిక వనరుల విషయం ప్రశ్నార్ధకమే

అంతా బాగానే ఉన్నా ఇంత బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం అంత ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అనేది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకమే. నవరత్నాలు అమలు చేయడం, సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం ప్రధాన ప్రాతిపదికగా బడ్జెట్ ప్రసంగం అంతా సాగింది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధాన పథకాలన్నిటికీ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన వైసిపి సర్కార్ కచ్చితంగా ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని తేల్చి చెబుతోంది.

 ప్రధాన ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు

ప్రధాన ప్రభుత్వ పథకాలకు నిధుల కేటాయింపు

ఇక బడ్జెట్ లో ప్రధానంగా సామాజిక పెన్షన్ల కోసం 16 వేల కోట్ల రూపాయలు, వడ్డీలేని రుణాల కోసం 1,100 కోట్ల రూపాయలు, ఎస్సీ, బిసి, ఎస్ టి, మైనారిటీల సంక్షేమానికి భారీగా నిధులు, చేయూత పథకానికి మూడు వేల కోట్ల రూపాయలు, వైయస్సార్ ఆసరా పథకానికి 6,300 కోట్ల రూపాయలు, అమ్మఒడి పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలు, ఇక జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు 2277 కోట్ల రూపాయలు, వై యస్ ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ పథకానికి 3615. 60 కోట్ల రూపాయలు, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు 46 కోట్ల రూపాయలు ఇలా చెప్పుకుంటూ పోతే బాగానే బడ్జెట్ కేటాయించారు.

ఆర్ధిక సంక్షోభ పరిస్థితులను ఏకరువు పెట్టిన మంత్రి బుగ్గన

ఆర్ధిక సంక్షోభ పరిస్థితులను ఏకరువు పెట్టిన మంత్రి బుగ్గన


అన్ని రంగాలకు బ్రహ్మాండంగా నిధులు కేటాయించిన ఏపీ ప్రభుత్వం ఆర్థిక వనరుల విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.ఒకపక్క కరోనా లాక్డౌన్ ప్రభావంతో ఆదాయం బాగా తగ్గింది. ఇక కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, వివిధ గ్రాంట్లు ఇప్పటి వరకు రాని పరిస్థితి. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఏపీలో గత ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలు దాదాపు రూ. 60వేల కోట్ల మేరకు పెండింగ్ బిల్లుల రూపంలో సునామీలా వచ్చిపడ్డాయని సాక్షాత్తు ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటించారు.

 ఆదాయ వనరులు తగ్గినా ముందుకు ఎలా వెళ్తున్నారన్నదే ప్రశ్న

ఆదాయ వనరులు తగ్గినా ముందుకు ఎలా వెళ్తున్నారన్నదే ప్రశ్న

2019-20, 2020-21లో కేంద్ర పన్నుల బదలాయింపులో తగ్గుదల, 2020-21కి సంబంధించిన డివిజబుల్ పూల్లో తగ్గినవాటాతోపాటు కోవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో ఆదాయ వనరులు తగ్గాయన్నారు. అయితే ఈ అడ్డంకులను అధిగమించి ముందుకు వెళుతున్నామని అన్నారు. అయితే ఏ విధంగా ముందుకు వెళుతున్నారు, ఆదాయ వనరులు ఏంటి అనేది మాత్రం చెప్పలేదు.

బడ్జెట్ ఘనమే .. ఆదాయం ఏది ?

బడ్జెట్ ఘనమే .. ఆదాయం ఏది ?

ఇక అంతే కాదు ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ బుక్ లో కూడా ఎక్కడ ఆదాయం ఎంత వస్తుంది అన్న ప్రస్తావన చేయకపోవడం గమనార్హం. ఏదేమైనప్పటికీ కరోనా లాక్డౌన్ ఎఫెక్ట్, అంతకు ముందు నుండే ఏపీకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో,ఈరోజు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు చెప్పడానికి బాగానే ఉన్నా, ఖర్చులు చిట్టా కరెక్టుగానే చెప్పినా, చూడటానికి బాగా ఘనంగా అనిపించినా ఆదాయ మార్గం ఏది అన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది.

English summary
Finance Minister Buggana Rajendranath Reddy introduced the budget said the budget expenditure was Rs 2,24,789 crore. The revenue estimate is at Rs 1,80,392 crore. The capital expenditure is estimated at Rs 44,396 crore. ut there is no Clarity about income source.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X