Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కంటే డబుల్ ఇస్తామని చెప్పి..

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రతిపాదనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘాటు విమర్శలు సంధించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరేలా కనిపించట్లేదని పేర్కొంది.

ఈ బడ్జెట్‌పై తాజాగా వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యురాలు వ‌రుదు క‌ళ్యాణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై పలు విమర్శనాస్త్రాలను సంధించారు. శుక్ర‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద ఆమె బ‌డ్జెట్ కేటాయింపుల‌పై మాట్లాడారు. ఈ ఏడాది బ‌డ్జెట్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను పూర్తిగా నిరాశ‌ప‌రిచింద‌ని అన్నారు.

AP Budget 2025 MLC Varudu Kalyani made key remarks

గ‌త బ‌డ్జెట్‌లో కూడా చంద్రబాబు- పవన్ కల్యాణ్ కూట‌మి ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను దారుణంగా మోసం చేసింద‌ని వరుద కళ్యాణి గుర్తు చేశారు. న‌మ్మి ఓట్లు వేస్తే ఇంత దారుణంగా మోసం చేస్తారా అంటూ ఆమె ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్ జ‌గ‌న్ కంటే డ‌బుల్ ఇస్తామ‌ని ఎన్నిక‌ల్లో నమ్మించి అధికారంలోకి వ‌చ్చిన చంద్రబాబు మ‌హిళ‌ల‌ను నిలువునా మోసం చేశార‌ని ఆరోపించారు.

మ‌హిళా శక్తికి నిధులు కేటాయించామ‌ని హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత గ‌త బ‌డ్జెట్‌లోనే చెప్పారని అన్నారు. నెల‌కు 1,500 రూపాయలు ఇస్తామ‌ని చెప్పి బ‌డ్జెట్‌లో రూపాయి కూడా కేటాయించ‌లేద‌ంటూ వరుద కళ్యాణి నిప్పులు చెరిగారు. నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవ‌ని, ఉచిత బ‌స్సు ఊసే లేద‌ని ధ్వజమెత్తారు.

త‌ల్లికి వంద‌నం, అన్న‌దాత సుఖీభ‌వ‌కు నిధుల కేటాయింపుల్లో భారీగా కోత విధించార‌ని వరుదు కళ్యాణి త‌ప్పుప‌ట్టారు. వైఎస్ జ‌గ‌న్ ముఖ్యమంత్రగా ఉండి ఉంటే ఇప్ప‌టికే అమ్మ ఒడి డ‌బ్బులు అందేవని, రైతు భ‌రోసా సాయం చేసేవార‌ని పేర్కొన్నారామె. ఈ బ‌డ్జెట్‌లో రైతు భ‌రోసాకు కంటి తుడుపు చ‌ర్య‌గా నిధులు కేటాయించార‌ని విమ‌ర్శించారు.

దీపం ప‌థ‌కాన్ని 90 లక్ష‌ల మందికే కుదించారని వరుదు కల్యాణి విమర్శించారు. సున్నా వ‌డ్డీకి నిధులే లేవ‌ని అన్నారు. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధికి 300 కోట్ల రూపాయలు మాత్ర‌మే ఇచ్చార‌ని, ఇవి ఏ మాత్రం స‌రిపోవ‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బ‌డ్జెట్ మొత్తం అంకెల గార‌డీగానే క‌నిపిస్తోంద‌ని వ‌రుదు క‌ళ్యాణి అభివ‌ర్ణించారు.

గ‌త ప్ర‌భుత్వాన్ని తిట్ట‌డానికే బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఉంద‌ని, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్‌ను పొగ‌డ‌టానికే శ్ర‌ద్ధ చూపార‌ని, ప‌వ‌న్ కోప‌్పడుతార‌నే కారణంతో అప్పుడప్పుడు ఆయన పేరును ప్ర‌స్తావిస్తున్నారని వరుదు కల్యాణి ఎద్దేవా చేశారు. ఈ బ‌డ్జెట్‌తో రాష్ట్రం తిరోగ‌మ‌నంలో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని, ఏరు దాటాక తెప్ప త‌గిలేశార‌ని మ‌రోసారి తేట‌తెల్ల‌మైంద‌ని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+