బెంగళూరులో ఆంధ్ర వ్యాపారి సురేంద్ర కుమార్ కాల్చివేత
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆంధ్ర వ్యాపారి సురేంద్ర కుమార్ దారుణ హత్యకు గురయ్యారు. అతని ఇంటి వద్దనే దుండగులు అతనిపైకి ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సురేంద్ర కుమార్ అక్కడికక్కడే కూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు.
ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సురేంద్ర కుమార్‌ను దుండగులు ఆయన కార్యాలయం నుంచి బైకులపై అనుసరించినట్లు తెలుస్తోంది. ఇంటికి చేరుకున్న వెంటనే అతనిపైకి కాల్పులు జరిపినట్లు సమాచారం.

దీపావళి టపాసుల మోతలో సురేంద్ర కుమార్ హత్యకు గురైన విషయాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. సురేంద్ర కుమార్ పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్నారు. వ్యాపార వివాదాలే హత్యకు కారణమని భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ అతన్ని హత్య చేసి ఉంటుందని భావిస్తున్నారు.
సురేంద్ర కుమార్‌పై పలు చీటింగ్ కేసులు ఉండేవి. ఆ కేసుల్లో ఆయన కోర్టుల్లో గెలిచారు. అదే సమయంలో ఆయనకు సెక్యూరిటీ ఏజెన్సీలు, మినరల్ వాటర్ వ్యాపారాలు ఉన్నాయి. గతంలో ఆయన మంత్రితో సన్నిహితంగా ఉండేవారు. తర్వాత ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications