పదవుల ఖరారు వేళ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆసక్తి కర నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈఏపి ప్రాజెక్టులు మినహా ఏపి సీఅర్డీఏ చేపట్టే పనులకు టెండ ర్ల పరిమితి పెంపు కోసం నిభందనల సవరణ కోసం కేబినెట్ లో చర్చించారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. మొత్తం 21 అంశాలు ఏజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది.

34 శాతం రిజర్వేషన్లు
ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీ ఎస్సి ఎస్టీ, మైనారిటీ లకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019 లో చేసిన చట్టాన్ని వెనక్కు తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో ఆ చట్టంలో లోటుపాట్లు సవరించేలా కొత్తం చట్టం తెచ్చే ప్రతిపాదన పై కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపారు. టిటిడిలో పోటు లో పని చేసే వర్కర్ లను సూపర్ వైజర్ లుగా అప్గ్రేడ్ చేస్తూ కేబినెట్ లో చర్చించారు. వీరిని సీనియ ర్ అసిస్టెంట్ కేడర్ కు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. స్టాంపు లు రిజిస్ట్రేషన్ల శాఖ లో డాక్యుమెంట్ ల రిజిస్ట్రేషన్ కు డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశ పెట్టే ప్రతిపాదన పై కేబినెట్ చర్చించింది.

AP Cabinet approved 34 Reservations for BC Communities in Nominated posts details here

కీలక నిర్ణయాలు
తిరుపతి జిల్లా లోని చెన్నై - బెంగుళూరు పారిశ్రామిక కారిడార్ లో భూములు కోల్పోయిన వారికి పరిహారం గా ఎకరానికి 8 లక్షల చొప్పున ఇచ్చేందుకు కేబినెట్ లో ప్రతిపాదించారు. భారత్ లో తయారైన విదేశీ మద్యం , బీర్, ఎఫ్ ఎల్ స్పిరిట్ ల పై అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ సవరణ కు కేబినెట్ లో ఆమోదం తెలిపినట్లు సమాచారం. విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో వెయ్యి గజాల వరకు కూడా సవరణ చేయలని నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా చర్చగా ఉన్న పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్టసవరణకు వచ్చిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.

పథకాల పై చర్చ
ఏపీ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎమ్‌ఎస్‌ఏఈ పాలసీని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సహకాలు అందించే విధంగా కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకు న్నారు. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతో పాటు.. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్త లను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మరోవైపు పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే అంశం పైన కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమ పథకాల అమలు.. ఎమ్మెల్సీ ఎన్నికల తో పాటుగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ పైన మంత్రివర్గంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+