ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, ఇక నుంచి..!!

ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్ర ఆర్దిక పురోగతి కి సంబంధించి అవసరమైన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసారు. ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ కి దోహద పదే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండా తరువాత రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల పైన చర్చించారు. మంత్రులు మరింత చొరవతో వ్యవహరించాలని సీఎం నిర్దేశించారు. ప్రతీ మంత్రి తమ శాఖల పైన పట్టు పెంచుకోవటంతో పాటుగా ప్రభుత్వ నిర్ణయాల ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని స్పష్టం చేసారు.

కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఇవాళ జరిగిన క్యాబినెట్ రాష్ట్ర ఆర్థిక పురోగతికి, ఏఐ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఎస్‌ఐపీబీ మీటింగ్‌లో చర్చించిన నిర్ణయాలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి స్పష్టం చేశారు. వివిధ పాలసీలకు అనుగుణంగా ప్రోత్సాహకాలు ఇచ్చి రూ.1.17లక్షల కోట్ల పెట్టుబడుల కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. సుమారు 70 వేల ఉద్యోగాలు వచ్చేలా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ లిమిటెడ్ ప్లాంటు, చింతా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తోటపల్లి బ్యారేజి నుంచి 24 ఎంసీఎం నీటి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. శ్రీశైలం ఆలయం అభివృద్ధికి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ap-cabinet-approves-1-17-lakh-cr-investments-in-the-state-also-for-land-allocations

రిలయన్స్ కన్సూమర్ ప్రాడెక్ట్‌‌ల కింద కర్నూలు జిల్లాలో రూ.758 కోట్లతో ప్యాక్టరీ నెలకొల్పడానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా 500 మందికి ఉద్యోగాలు వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. టూరిజం పాలసీ ఒక గేమ్ ఛేంజర్ అందుకే దానిపై కేబినెట్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు చెప్పుకొచ్చారు. దానికోసం ప్రత్యేకమైన ల్యాండ్ పార్సిల్స్ ఏర్పాటు చేయలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. పెట్టుబడి దారులకి ఒక డెస్టినేషన్ ఉండేలా కేబినేట్ జరిగిందన్నారు. విశాఖ లో ని మూడు ప్రాంతాలలో అతి పెద్ద డేటా సెంటర్స్ కి సంబంధించి భూ కేటాయింపుల కి కేబినేట్ ఆమోద తెలిపింది. దీని ద్వారా భవిష్యత్తులో మరికొన్ని డేటా సెంటర్స్ వచ్చే అవకాశం ఉండనుందని పేర్కొన్నారు. మంత్రులు తమ పని తీరు మెరుగు పర్చుకోవాలని.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+