మంత్రులపై చంద్రబాబు ఆగ్రహం, బెరైటీస్ రద్దుపై పల్లె
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల పైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. కొందరు మంత్రులు సరైన నాయకత్వం అందించలేకపోతున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారంటున్నారు. కొందరి తీరు అసహనం కలిగిస్తుందని బాబు చెప్పారంటున్నారు.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదని కొందరు మంత్రులను ప్రశ్నించారు. పాత జీవో ఉందంటూ సమాధానం చెప్పగా.. సీఎం మండిపడ్డారని తెలుస్తోంది. పలువురు మంత్రుల పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు, ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. బెరైట్స్ గనుల జీవోను జారీ చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రుల పైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

పల్లె
మంగంపేట బెరైటీస్ లీజుకు సంబంధించి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జారీ అయిన జీఓ 296ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ జీఓ కింద ఇచ్చిన లీజులన్నీ వాటతంట అవే రద్దయిపోతాయి. ఈ అంశంపై మంగళవారం కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

పల్లె
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మీడియా ప్రతినిధులకు వివరించారు. మంగంపేట ప్రాంతంలో 250 హెక్టార్లలో విస్తరించి ఉన్న లీజులన్నింటినీ రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు చెప్పారు. లీజు అద్దె ఏటా ఐదుశాతం కన్నా ఎక్కువ పెంచేందుకు వీలులేకుండా జీఓ జారీ అయిందన్నారు.

పల్లె
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెరైటీస్ గనుల్లో మంగంపేట గనులే 25శాతంగా ఉంటాయని, అలాగే మన దేశంలోని బెరైటీస్ గనుల్లో మంగంపేట గనుల విస్తీర్ణం 95శాతం ఉంటుందని పల్లె తెలిపారు. ఈ మొత్తం గనుల్లో ఉండే బెరైటీస్ విలువ దాదాపు 50వేల కోట్లు ఉంటుందని అంచనా వేశామన్నారు.

పల్లె
మంగంపేట బెరైటీస్ గనుల్లో మొదటి నుంచి అక్రమంగా మైనింగ్ జరుగుతోందని తమ ప్రభుత్వ దృష్టికి వచ్చిందని పల్లె తెలిపారు. అందువల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వస్తోందన్నారు. బెరైటీస్ ఖనిజం మంగంపేటలో టన్నుకు 4475 రూపాయలుగా ఉందని, దీన్నే చెన్నై తీసుకెళ్లి టన్నుకు 9119 రూపాయలకు విక్రయిస్తున్నారని తెలిపారు. అంటే కేవలం ఒకే ఒక టన్నుపై 4300 రూపాయలు లబ్ది పొందుతున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఎంతనష్టం వస్తుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

పల్లె
ఇక నుంచి బెరైటీస్ ఖనిజం అక్రమంగా మైనింగ్ చేయకుండా గనుల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామన్నారు. ఇలా ఉండగా 2004-14 మధ్య కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్న మంత్రివర్గ ఉపసంఘం బెరైటీస్ గనుల అక్రమాల పైనా విచారణ చేస్తుందని వెల్లడించారు.

పల్లె
గనుల తవ్వకం పారదర్శకంగా ఉండేలా చూస్తామన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజులను రద్దు చేయడం వల్ల మళ్లీ తాజాగా గ్లోబల్ టెండర్లను పిలుస్తామన్నారు. ఇలా ఉండగా మంగంపేట వద్ద ప్రస్తుతం 45 వేల టన్నుల బెరైటీస్ నిలువలు వృథాగా పడి ఉన్నాయని, వీటిని విక్రయించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.












Click it and Unblock the Notifications