అమరావతి పై కేబినెట్ కీలక నిర్ణయం - బిగ్ టర్న్..!!
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలతో కూడిన అజెండా పైన మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో రూ 24,276 కోట్ల విలువైన పనులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పోలవరం టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీషెడ్యూల్ కు స్టాంప్ డ్యూటీ మినహాయింపు పైనా చర్చించారు. అదే విధంగా కొత్త రుణాల పైనా కేబినెట్ లో చర్చ జరిగింది.
అమరావతికి రుణం
ఏపీ మంత్రివర్గంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదించింది. ధాన్యం కొనుగోలు కోసం మార్క్‌ఫెడ్ ద్వారా వెయ్యి కోట్ల రుణం మంజూరుకు అనుమతించారు. వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారంటీకి మంత్రివర్గం ఆమోదించింది. అమరావతి నిర్మాణానికి హడ్కో ద్వారా 11 వేల కోట్ల రుణం, కేఎఫ్‌డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5 వేల కోట్ల రుణం పొందడానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

స్టాంపు డ్యూటీ మినహాయింపు
రాష్ట్రంలో పది జిల్లాల్లో వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు ప్రతిపాదన పైనా చర్చించి.. ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాల్వ పనులకు రీ టెండర్లు పిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక, మున్సిపాలిటీ చట్టం 1965లో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రివర్గం తిరస్కరించినట్లు సమాచారం. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్ లభిం చింది. ఏపీ రిసర్వే ప్రాజెక్టుకు సంబంధించి గ్రామ కంఠం భూముల సర్వే కోసం తీసుకున్న 679 సూపర్ న్యుమరి డిప్యూటీ తహసీల్దార్‌లను మరో రెండేళ్లు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు.
మంత్రివర్గం ఆమోదం
ఇక, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్ర ఏర్పాటుకు 50 ఎకరాల 20 సెంట్లు భూమికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులకు ఒప్పందం ఇప్పటికే గడువు ముగియటంతో టెండర్లు పిలవడానికి క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగింది. ఆ తరువాత టెండర్ల కోసం అనుమతి ఇస్తూ నిర్ణయించారు. క్లీన్ ఎనర్జీ ప్రాజె క్టుల కోసం ఎన్టీపీసీ, ఎన్ఆర్ఈడీసీఏపీ జాయింట్ వెంచర్ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఇక,
475 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ డిసెంబర్ 2024 నుంచి మధ్యాహ్న భోజనం అమలుకు నిధులు కేటాయింపునకు క్యాబినెట్‌లో పరిపాలన అనుమతి లభించింది.












Click it and Unblock the Notifications