కేబినెట్ భేటీ: మంత్రులకు క్లాస్, జగన్ టూర్ లో - పవన్ కీలక వ్యాఖ్యలు..!!
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అధికారిక అజెండాతో పాటుగా రాజకీయ అంశాల పైన ప్రధాన చర్చ జరిగింది. మరోసారి మంత్రుల పైన సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రులు శాఖల పైన పట్టు పెంచుకోవటంతో పాటుగా నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం పైనా ఇప్పటికైనా క్రియాశీలకంగా మారాలని సూచించారు. ఇదే భేటీలో డిప్యూటీ సీఎం పవన్ సైతం కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
ఏపీ మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు కీలక అంశాలను మంత్రులతో షేర్ చేసుకున్నారు. మంత్రులు తమ శాఖలో జరుగుతున్న అభివృద్ధి పై అవగాహన పెంచుకోవాలని నిర్దేశించారు. విద్యుత్ టారిఫ్ తగ్గింపు పై సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని సీఎం అభిప్రాయం వ్యక్తం చేసారు. యూనిట్ కు 13 పైసలు తగ్గించినా ఓనర్షిప్ తీసుకోలేకపోయారని విద్యుత్ శాఖపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ఇలాంటివి సరి చేసుకోవాలని సూచించారు. జగన్ తాజాగా చేసిన అనకాపల్లి పర్యటన పైన చర్చ జరిగింది. జగన్ పర్యటనకు ప్రజలనుంచి స్పందన లేదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. మెడికల్ కళాశాల పై సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు.
రెండు మెడికల్ కళాశాలను వీలైనంత త్వరగా పూర్తిగా చేయాలని సీఎం ఆదేశించారు.

ఇక, తాజాగా బయట పడిన నకిలీ మద్యం అంశం ప్రస్తావనకు వచ్చింది. అనధికార బెల్ట్ షాప్స్ నియంత్రించాలని సీఎం ఆదేశించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ కర్నూలు పర్యటన పైనా మంత్రులకు సీఎం దిశా నిర్దేశం చేసారు.GST సమావేశాలు దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ జరిగినట్టు వివరించారు. ఇక నుంచి మంత్రులను మీడియా కు అందుబాటులో ఉండాలని సూచించారు. జరిగిన అభివృద్ధి పై మీడియా తో తరచూ మాట్లాడాలని మంత్రి లోకేష్ సూచించారు. కాగా, ఈ భేటీలో పవన్ SIBP పై కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పెట్టుబడుల ప్రోత్సాహకంలో భాగంగా పరిశ్రమలకు భూములు కేటాయిస్తున్నామని.. ఆ తరువాత వారు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు.. ఎంత పెట్టుబడులు వచ్చాయనేది నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
ఇక.. విశాఖ పైన చంద్రబాబు ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ముంబాయి తరహాలో విశాఖ ను డెవలప్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆరెస్సెల్ మిట్టల్ ప్లాంట్ కు త్వరలో శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. టీసీఎస్, గుగూల్ వంటి సంస్థల రాకతో విశాఖ రూపు రేఖలు మారుతాయని వివరించారు. అంతకు ముందు మంత్రులతో భేటీ సమయంలో లోకేష్ తాజాగా వెలుగులోకి వచ్చిన నకిలీ మద్యం అంశం పైన మాట్లాడారు. మంత్రులు ప్రభుత్వం పైన జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ ప్రభుత్వం పైన అసత్యాలు ప్రచారం చేసారని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications