మరో ఎన్నికల హామీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం..!!
ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీకి అమోద ముద్ర వేసింది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి మంత్రివర్గంలో చర్చించారు. కొత్త పాలసీ ప్రకటనక మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాజీ సీఎం భూమల సర్వే..రాళ్ల పై ఫొటోల అంశం పైన చర్చించారు. వాటి స్థానంలో ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. మావోయిస్టుల పై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది.
ఆమోద ముద్ర
ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు. ఎన్నికల్లో హమీ ఇచ్చిన విధంగా స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కెబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేెశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, గత ప్రభుత్వంలోని ఎక్సైజ్ అవతవకలపై కెబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 ప్రభుత్వాల్లో ఎక్సైజ్ పాలసీలపై మంత్రివర్గం చర్చించింది.

కొత్త పాలసీ
గత ప్రభుత్వం దోపిడీకే ఎక్సైజ్ పాలసీ రూపొందించినట్టు కేబినెట్ అభిప్రాయపడింది. ప్రస్తుత ఎక్సైజ్ పాలసీని తప్పించి.. కొత్త ఎక్సైజ్ పాలసీ రూపొందించేందుకు కెబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కూడా మార్పులు తేవాలని కెబినెట్ సూచన చేసింది. ఇక..మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గత ప్రభుత్వం ఇచ్చిన 217 జీవో రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కెబినెట్లో నిర్ణయం ప్రకటించింది. భూమల సర్వే పేరుతో రాళ్ల పైన జగన్ బొమ్మ అంశం పైన మంత్రివర్గంలో సుదీర్గంగా చర్చ జరిగింది.
కొత్తగా పాసు పుస్తకాలు
సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయించింది. తొలుత మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై చర్చ సమయంలో పలువురు మంత్రులు జగన్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం రూ. 700 కోట్లు తగలేశారన్న మంత్రులు వ్యాఖ్యానించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ, పేరూ తొలగించడానికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీకి కెబినెట్ నిర్ణయం. రీ-సర్వే ప్రక్రియను అబయెన్సులో పెట్టాలని కెబినెట్ నిర్ణయం తీసుకుంది.
-
స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల సేవల పై ప్రభుత్వం అనూహ్య నిర్ణయం, తాజా ఆదేశాలు..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications