జగన్ లెక్కలు -కొత్త మంత్రులు : ఈ జాబితా నుంచే..!! ఎస్సీ ఛైర్మన్ -బీసీ స్పీకర్-ఫైనాన్స్ వారికే..!!
ఏపీలో కేబినెట్ ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతల అప్పగింత ద్వారా..అటు పార్టీ - ఇటు ప్రభుత్వ పరంగా సమూల మార్పులకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా ముందుగా శాసన మండలిలో భర్తీ చేయాల్సిన 14 సీట్ల పైన ఫోకస్ చేస్తున్నారు. ఆ తరువాతనే కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి కేబినెట్ కూర్పు సమయంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సామాజిక-ప్రాంతీయ సమీకరణాలు పక్కాగా అమలు చేసారు. ఊహించని విధంగా అయిదుగురు డిప్యూటీ సీఎంలను నియమించారు.

ప్రభుత్వం - పార్టీ ప్రక్షాళన
ఇక, ఇప్పుడు సీనియర్ల తో సహా ప్రస్తుత మంత్రులందరినీ తప్పించి..2024 ఎలక్షన్ టీం సిద్దం చేసుకుంటున్నారు. అందులో పార్టీ- ప్రభుత్వ వాయిస్ బలంగా వినిపించే వారితో పాటుగా... సామాజికంగా పక్కా లెక్కలు అమలు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి జాబితా ఆధారంగానే తుది ఎంపిక జరగనుంది. అయితే, సామాజిక సమీకరణాల్లో మాత్రం కీలక పదవుల విషయంలో పక్కగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

బీసీ-ఎస్సీ వర్గాలకు కీలక పదవులు
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శాసన మండలి ఛైర్మన్ గా టీడీపీ హయాంలో నియమించిన షరీఫ్ కొద్ది కాలం క్రితం వరకు కొనసాగారు. ఆయన పదవీ విరమణ చేసారు. ఇప్పుడు కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. మండలికి ఎస్సీ వర్గం నుంచి ఛైర్మన్ ను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందు కోసం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొయ్యే మోషేన్ రాజుకు ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇక, డిప్యూటీ ఛైర్మన్ గా బీసీ వర్గానికి చెందిన జంగా క్రిష్ణమూర్తి పేరు వినిపిస్తోంది.

మంత్రి పదవుల్లోనూ పక్కాగా సామాజిక సమీకరణాలు
అదే విధంగా శాసనసభ స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం మంత్రి పదవి కోరుకుంటున్నారని ప్రచారం. ఆయనను కేబిటనెట్ లోకి తీసుకుంటే మరలా బీసీ వర్గానికి చెందిన వారికే స్పీకర్ పదవి కేటాయించనున్నారు. ఇక, కేబినెట్ లో కీలకమైన ఆర్దిక శాఖ ఇప్పటి వరకు బుగ్గన రాజేంద్ర నాధ్ పర్యవేక్షించారు. అయితే, ఇప్పడు కేబినెట్ లో అందరి మంత్రులను తప్పిస్తే ఆర్దిక వ్యవహారాల్లో అనుభవం ఉన్న వారికి ఆర్దిక శాఖ అప్పగించాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపిస్తోంది, దీంతో..ఆనం రామనారాయణ రెడ్డి లేదా సీ రామచంద్రయ్య పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

కేబినెట్ లో ఎవరెవరికి ఛాన్స్
రాయలసీమ బలిజ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే రామచంద్రయ్యకు ఆ శాఖ దక్కే ఛాన్స్ ఉంది. అయితే, సీఎం సొంత జిల్లాకే ఆర్దిక శాఖ కేటాయిస్తారా అనేది చర్చకు కారణమయ్యే అంశం. ఇక, జిల్లాల వారీగా ప్రముఖంగా మంత్రి పదవుల కోసం రేసులో ఉన్న వారిలో శ్రీకాకుళం నుంచి తమ్మినేని సీతారాం, అదే విధంగా ధర్మాన ప్రసాద రావు తొలి వరుసలో ఉన్నారు. విజయనగరం నుంచి రాజన్నదొర..కోలగట్ల వీర భద్రస్వామి పేర్లు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి ముత్యాల నాయుడు.. గుడివాడ అమర్నాధ్ రేసులో ముందున్నారు.

ప్రాంతీయ-సామాజిక లెక్కలు తప్పకుండా
తూర్పు గోదావరి నుంచి ముగ్గురికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అందులో కాపు కోటా నుంచి దాడిశెట్టి రాజా, బీసీ వర్గం నుంచి పొన్నాడ సతీష్, అదే విధంగా కొండేటి చిట్టిబాబు పేర్లు వినిపిస్తున్నాయి. పశ్చిమ గోదావరి నుంచి క్షత్రియ కోటాలో ప్రసాద రాజు, ఆయనతో పాటుగా గ్రంధి శ్రీనివాస్, బాలరాజు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. క్రిష్ణా జిల్లా నుంచి పార్ధసారధి పేరు ఖాయమని చెబుతున్నారు. అదే విధంగా..జోగి రమేష్, సామినేని ఉదయభాను పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో సీనియర్ల పోటీ...
గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, బీసీ వర్గం నుంచి జంగా క్రిష్ణమూర్తి, ( డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం లేకుంటే ) , ఆళ్ల రామక్రిష్ణారెడ్డి, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. ప్రకాశం జిల్లా నుంచి మహీధర్ రెడ్డి, అన్నా రాంబాబు, సుధాకర్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామానారాయణ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల్లో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. చిత్తూరు జిల్లా నుంచి ద్వారకా నాధ్ రెడ్డి, రోజా, చెవిరెడ్డి భాస్కర రెడ్డి. భూమన కరుణాకర రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా, వీరిలో ఒకరితో పాటుగా బీసీ వర్గానికి ఒక బెర్తు ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది.
Recommended Video

జగన్ నిర్ణయం పై పార్టీలో ఉత్కంఠ
కడప జిల్లా నుంచి కోరుముట్ల శ్రీనివాసులు, సీ రామచంద్రయ్య, శ్రీకాంత రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి శిల్ప చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. చివరగా అనంతపుం నుంచి పోటీ ఎక్కువగా ఉంది. వారిలో అనంత వెంకటరామి రెడ్డి, ప్రకాశ్ రెడ్డి , ఉషా శ్రీ చరణ్, కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, ఇక్కడ బీసీ - రెడ్డి వర్గాలకు అవకాశం దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో..జగన్ చివరకు ఏ జిల్లా నుంచి ఏ వర్గానికి ..ఎవరికి అవకాశం ఇస్తారనేది వేచి చూడాల్సిందే.
-
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications