అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేబినెట్ విస్తరణ పై సీఎం తేల్చేసారు - నేరుగా మంత్రులతో : వారికిచ్చే బాధ్యతల పైనా..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ పైన సాగుతున్న సస్పెన్స్ కు సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు బడ్జెట్ ఆమోదం కోసం సమావేశమైన మంత్రివర్గ సమావేశంలో దీని పైన సీఎం జగన్ ప్రస్తావించారు. సమావేశం సమయంలో కొందరు సీనియర్లు ఇదే తమకు చివరి మంత్రివర్గ సమావేశమా అంటూ ప్రస్తావించారు. ఆ సమయంలో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావాహులు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. మంత్రివర్గ కూర్పు అంటే సామాజిక - ప్రాంతీయ సమీకరణాల లెక్క తప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Recommended Video

AP Cabinet Expansion: AP CM Jagan Over cabinet reshuffle | Oneindia Telugu
డిమోషన్ గా భావించవద్దు

డిమోషన్ గా భావించవద్దు


మంత్రివర్గంలో స్థానం కోల్పోతే అది డిమోషన్ గా భావించివద్దని సీఎం వారికి సూచించారు. మంత్రి పదవులు కోల్పోయిన వారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. ఉగాది నుంచి కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న సమయంలో కొత్తగా 26 జిల్లాలకు పార్టీ తరపున ప్రస్తుత మంత్రులు ఇన్ ఛార్జ్ లుగా ఉంటారనే సంకేతాలు ఇచ్చారు. పార్టీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే..మళ్లీ మీకే అవకాశం దక్కుతుంది కదా అంటూ సీఎం వారిలో కొంత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నా చేసారు. అయితే, పూర్తి స్థాయిలో మంత్రులను తప్పిస్తారనే విధంగానే సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని కొందరు మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది.

కొందరికి మినహాయింపు ఉంటుందా

కొందరికి మినహాయింపు ఉంటుందా

కొందరిని తప్పించి.. మరి కొందరిని కొనసాగిస్తే సమస్యలు వచ్చ అవకాశం ఉందని .. ఆశావాహులు చాలా మంది ఉన్నారని చెప్పటం ద్వారా అందరినీ తప్పిస్తారనే అభిప్రాయం వారిలో వ్యక్తం అవుతోంది. ఈ నెల 15న జరిగే వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో సీఎం ఎమ్మెల్యేలకు 2024 ఎన్నిక లకు సంబంధించిన రూట్ మ్యాప్ ను ఖరారు చేయటంతో పాటుగా.. మంత్రివర్గ విస్తరణ పైన మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఆ రోజున సమావేశంలో అన్ని విషయాలు వెల్లడిస్తామని సీఎం చెప్పుకొచ్చిన ట్లుగా తెలుస్తోంది. అయితే, కొందరు మంత్రులను సీఎం కొనసాగించాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

పదవులు కోల్పోయిన వారికి పార్టీ బాధ్యతలు

పదవులు కోల్పోయిన వారికి పార్టీ బాధ్యతలు


ఇప్పటికే ఎవరిని కొనసాగించాలి.. ఎవరిని తప్పించాలనే దాని పైన సీఎం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లాల ఆధారంగా పార్టీ సమస్యలు..బలహీనతలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రస్తుతం ఉన్న సీనియర్ మంత్రులకు బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రస్తుతం ఉన్న వారిలో నలుగురు మంత్రులను కొసాగించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే..కొత్త మంత్రులతోనూ కేబినెట్ కూర్పు పూర్తయితే ..ఇక, పార్టీ - ప్రభుత్వ పరంగా వేగంగా లక్ష్య సాధనలో ముందుకెళ్లాలని సీఎం భావిస్తున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. దీంతో..ఉగాది రోజునే ఏపీ కేబినెట్ విస్తరణకు ఉందని తెలుస్తోంది.

ఉగాది నాటికే విస్తరణ చేపట్టేలా

ఉగాది నాటికే విస్తరణ చేపట్టేలా

2019 లో అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో తాను కేబినెట్ లో అవకాశం ఇస్తున్న వారికి రెండున్నారేళ్ల కాలం పదవి ఉంటుందని..ఆ తరువాత 90 శాతం వరకు మార్పు ఉంటుందని చెప్పారు. ఇక, ఈ నెల 15వ తేదీన ఏర్పాటు కానున్న పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలోనూ ప్రస్తుత మంత్రులు..కొత్తగా కాబోయే మంత్రుల విషయంలో సీఎం జగన్ స్పష్టత ఇవ్వనున్నారు. కొత్త మంత్రులు ప్రభుత్వం నుంచి మాజీలయ్యే మంత్రులు జిల్లా పార్టీ ఇన్ ఛార్జ్ లుగా ఉండే వారితో సమన్వయం చేసుకొని ముందుకు సాగాల్సి ఉంటుంని సీఎం స్పష్టం చేయనున్నారు. అయితే, ఉగాది నాటికి కొత్త మంత్రులు కొలువు తీరటం ఖాయంగా కనిపిస్తోంి. అయితే, సీఎం ఆలోచనలు చివరి నిమిషం వరకు ఎలా ఉంటాయో..ఎవరిని తప్పిస్తారో..ఎవరికి అవకాశం ఇస్తారో అనేది మరింత ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
CM Jagan had given the responsinilities as ditrict party incharge to the currrent ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X